"ఒక్క ట్వీటు, ఒక్క ఇమెయిల్, ఒక్క ఫోన్"... అన్ని కూడా ఉచితం, 16 నెలలు వెయ్యి రూపాయల బాట చెప్పులు అరిగేలాగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగా............ఏమి ఉపయోగం లేదు!... పైగా నా సొంత జిల్లా, ఆ పైగా నూతన రాజధాని ప్రాంతం, ఆ ఆ పైగా ఏడుగురు శాసనసభ్యులు, ముగ్గురు మంత్రులు, ఇద్దరు పార్లమెంట్ సభ్యులు, జిల్లా పరిషత్ అధ్యక్షులు మొదలగు వారితో పరిచయం ఉన్నప్పటికీ..............వాళ్ల దగ్గరకు వెళ్లి సహాయం అడగటానికి ఎదవ అహం అడ్డం వచ్చింది, ఒక సామాన్యుడిలా ఈ సమస్యను ఎదుర్కొని చూద్దాం అప్పుడే కదా అసల ఈ ప్రభుత్వం పాలన తెలిసేది అని అలోచించి ఒక చిన్న పని చేశా.................... అదే "ఒక్క ట్వీటు, ఒక్క ఇమెయిల్, ఒక్క ఫోన్" మనం 10 రోజులు అన్నం పెట్టి 11వ రోజు పెట్టకపోతే "ఇన్ని రోజులు ఎందుకు పెట్టావు? ఇప్పుడు ఎందుకు పెట్టను అంటున్నావు?" ఇలా ప్రశ్నించినప్పుడు మన ముఖం గోచిలో పెట్టుకోవాలి అనిపిస్తుంది కదా? ఇన్ని సంవత్సరాలు మేతకి అలవాటు పడ్డ మన ప్రభుత్వ అధికారులది (అందరూ కాదు) ఇదే పరిస్థితి! "లంచం" "లంచం" "లంచం"

samanyudu 22122017 2

నేను ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగిని, అమరావతి మండలం, నరకుళ్ళపాడు అనే గ్రామ పంచాయితి పరిధిలో పంచాయితి వారికి సంబంధించి నిరుపయోగంగా ఉన్న RO ప్లాంటును బాగుచేసి, ఆ గ్రామ ప్రజల త్రాగు నీటి అవసరాల నిమిత్తం దానిని ఉపయోగించుకునేలా తయారు చేసి ఇవ్వవలసినదిగా RWS&S డిపార్టుమెంటు అధికారులు మమ్ముల్ని ఆదేశించారు, మేము వారి ఆదేశాల మేరకు పనిని అనుకున్న సమయానికి పూర్తి చేసి ఇచ్చాము....................ఇక సినిమాలో చూపించే విధంగా నాకు జరిగింది, ఆ శాఖ ఈ శాఖ అంటూ రెండు లక్షల రూపాయలకు పెద్ద పెద్ద కధలు చెప్పటం మొదలు పెట్టారు, నేను వినడం మొదలుపెట్టా, మధ్యలో ఖద్దరు బట్టలు తొడిగిన రాజకీయ నిరుద్యోగులు కూడా కలగచేసుకున్నారు అండోయ్...............ఇలా సంవత్సరం గడిచింది!

samanyudu 22122017 3

ఏమి చేయాలిరా భగవంతుడా అని అనుకుంటూ, నాతోపాటు రోజు ఆ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే మరికొంత మంది పరిచయం అవ్వటంతో వారు కొనుక్కున్న శనక్కాయలు తింటూ ఆలోచిస్తూ ఉండగా మా గురువుగారు శ్రీ మొవ్వా వృషాద్రిపతి గారి తిట్టు ఒకటి బాగా గుర్తుకు వచ్చింది, అదే 'మూత్రవిసర్జన'. ఈ పదానికి నిజంగా అర్ధం తెలియచేయాలి అని గట్టిగా ప్రతిజ్ఞ చేసుకున్నా. అప్పుడే పెట్టా "ఒక్క ట్వీటు, ఒక్క ఇమెయిల్, ఒక్క ఫోన్" నేనే ఆశ్చర్య పోయేలా ఫలితాలు.............ఒక జిల్లా స్థాయి అధికారి ఫోన్ చేసి అప్పటివరకూ హరిన్ చంద్ అని పిలిచిన గొంతే హరిన్ చంద్ "గారు" అనడం మొదలు పెట్టింది............. 640 రోజులు పోరాటం చేసిన పూర్తి కాని పని కేవలం 20 రోజులలో అయిపోయింది. అదే "ఒక్క ట్వీటు, ఒక్క ఇమెయిల్, ఒక్క ఫోన్" మహత్యం. అప్పుడు అర్ధమైంది ఈ చినబాబు ఆయన బాబు కన్నా పెద్దబాబు అవుతాడు అని, ఏమి సందేహం లేదు, ఇది నిజం, రాసుకోండి, గుర్తు పెట్టుకోండి! నాకు సహకరించిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి, పంచాయితీరాజ్ శాఖమాత్యులు శ్రీ నారా లోకేశ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ............... ఒక సామాన్యుడు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read