పోలవరం విషయంలో సోము వీర్రాజు లాంటి రాష్ట్ర బీజేపీ నేతలు, అలాగే ఆయన స్నేహితులు అయిన వైసిపి పార్టీ నేతలు, అవినీతి జరిగిపోయింది అని గగ్గోలు పెట్టారు... రాష్ట్ర ప్రభుత్వం అవినీతి చేసింది కాబట్టే, పోలవరం లేట్ అవుతుంది అంటూ, ప్రజలని తప్పు దోవ పట్టించారు... ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు అన్నీ ఆన్లైన్ లో ఉన్నాయి అని చెప్పినా వినలేదు... అయినా, బిల్లులు సమర్పించకుండా, వాతిని స్క్రూటినీ చెయ్యకుండా, ఎవరైనా నిధులు ఇస్తారా ? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి, బిల్లులు పెట్టి, కేంద్ర ప్రభుత్వం ద్వారా నాబార్డ్ నుంచి పెట్టిన ఖర్చు రాబట్టుకుంటుంది..
ఇలాంటి చోట అవినీతి ఎలా జరుగుతుందో, వీరికే తెలియాలి... ఇది ఇలా ఉండగానే, వీరికి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు సీఈవో ఎస్‌కే హల్దర్ చెప్పిన మాటలు మరింత ఇబ్బంది కలిగిస్తున్నాయి... పోలవరం ప్రాజెక్టు సీఈవో ఎస్‌కే హల్దర్ గురువారం క్షేత్ర స్థాయి పర్యటన చేశారు... ఈ సందర్భంగా బిల్లులు గురించి మాట్లాడుతూ, ప్రాజెక్టు పనులకు సంబంధించి నిధుల వినియోగ పత్రాల(యూసీ - యుటిలైజేషన్ సర్టిఫికేట్)తో పాటు బిల్లులు కూడా తమకు నేరుగా పంపిస్తున్నారని, వీటి పరిశీలన తమకు బాగా కష్టమవుతోందని చెప్పారు. ఇక యూసీలు పంపితే చాలని సూచించారు.
బిల్లులు టైం పడతాయి అని, ప్రాజెక్ట్ తొందరగా ముందుకు వెళ్ళాలి అంటే, ఇవన్నీ జాప్యం అవుతాయి అని అన్నారు... ఒక పక్క బిల్లులు పంపిస్తేనే అవినీతి అని గగ్గోలు పెడుతున్న రాష్ట్ర బీజేపీ బ్యాచ్ ఇప్పుడు ఏమి అంటుందో ? ఇది కేంద్రానికి చంద్రబాబా పై ఉన్న నమ్మకం... కేవలం యుటిలైజేషన్ సర్టిఫికేట్ చాలు అని అంటున్నారు అంటే, మనం ఎంత పక్కాగా పని చేస్తున్నామో అర్ధమవుతుంది... ఇంకా ఈ సొల్లు ఆపి, మీరు కూడా కేంద్రంతో పోరాడితే అందరికీ మంచింది... ఆ వైసీపీ బ్యాచ్ తో కలిసి, వీళ్ళు చేస్తున్న పనులు ప్రజలు చూస్తూనే ఉన్నారు... పోలవరం, అమరావతి జోలికి వస్తే, ప్రజలు కప్పెడతారు జాగ్రత్త...