ఆర్టీసీకి కొత్త అస్త్రాలు వచ్చి చేరుతున్నాయి... నగరాల్లో కాలుష్యం తగ్గించేందుకు ఆర్టీసీ ఇంతకు ముందు గ్యాస్ తో నడిచే బస్సులు నడిపింది... వివి విజయవంతం అవ్వటంతో, వాటి కంటే సమర్ధవంతమైన, ఎలక్ట్రిక్ బస్సుల వైపు ఆర్టీసీ చూస్తుంది... దీని కోసం గోల్డ్‌స్టోన్‌ కంపెనీకి చెందిన ఎలక్ర్టిక్‌ బస్సును కొనుగోలు చేసింది. నూరుశాతం ఎలక్ర్టిక్‌ ఆధారితంగా మార్కెట్లోకి వచ్చిన ఈ బస్సును ప్రయోగాత్మకంగా ఆర్టీసీ నడపాలని నిర్ణయించింది. బుధవారం ఈ బస్సు విజయవాడ డిపో గ్యారేజీకి వచ్చింది.

apsrtc 22122017 2

రిజిస్ర్టేషన్‌ పూర్తయిన తర్వాత గన్నవరం, వెలగపూడి మధ్య ఆర్టీసీ ప్రయోగాత్మకంగా నడుపుతుంది. ట్రయల్‌ విజయవంతమైతే.. మరిన్ని ఎలక్ర్టికల్‌ బస్సులు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులను తిప్పనుంది... ఎలక్ర్టికల్‌ బస్సు కాబట్టి పొగ రాదు. దీనికి ప్రత్యేక ఇంజిన్‌ అంటూ ఏమీ ఉండదు. పూర్తిగా విద్యుత్‌రీ ఛార్జితో పనిచేస్తుంది. ఈ బస్సులో శక్తివంతమైన బ్యాటరీలు ఉంటాయి. ఈ బ్యాటరీలకు నాలుగు గంటల పాటు ఛాంగ్‌ పెడతారు. విజయవాడ డిపో గ్యారేజీలోనే తాత్కాలికంగా ఛార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేశారు.

బ్యాటరీ బస్సుల ప్రత్యేకతలు ఇవీ... వాయు కాలుష్యానికి దోహదపడే ఎలాంటివి ఈ బస్సు నుంచి విడుదల కావు... బస్సు ఆకర్షణీయంగా, సౌకర్యవంతంగా ఉంటుంది... క్యాతోడ్ మెటీరియల్ తో శక్తివంతమైన బ్యాటరీల తయారీ... శక్తివంతమైన చార్జింగ్ వ్యవస్థను కలిగి ఉండటం వల్ల వేగంగా చార్జింగ్ అవుతుంది... ఒక్కసారి చార్జింగ్ పెడితే 350 కిలోమీటర్లు నడుస్తుంది... బస్సులో మొత్తం 47 సీటింగ్‌ ఉంటుంది. ..ఈ బ్యాటరీ మేనేజ్ మెంట్ సిస్టమ్ (బీఎంఎస్) ఉంది... బ్యాటరీ సేఫ్టీని ఇది పరిసీలుస్తుంది... ఫైర్ సేఫ్టీ బ్యాటరీలు ఏర్పాటు చెయ్యటం మరో ప్రత్యేకత.... కుదుపులు లేని ప్రయాణం కోసం ఎయిర్ సస్పెన్షన్ వ్యవస్థ... ఆన్ బోర్డు మ్యాప్, నేవిగేషన్ వ్యవస్థలు ఉంటాయి... సిసి కెమెరా పర్యవేక్షణ... ఇది పూర్తిగా శబ్ద రహిత బస్సు. ఈ బస్సు స్టార్ట్‌ చేసినది మొదలు.. ప్రయాణంలో ఎక్కడా కూడా శబ్దం రాదు...ఈ బస్సుకు డోర్స్‌ అన్నీ పడితేనే స్టార్ట్‌ అవుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read