కాకినాడ ఎస్టీఆర్ సాగర తీరంలో మూడు రోజుల పాటు నిర్వహించిన బీచ్ పెస్టివల్ గురువారం రాత్రితో ఘనంగా ముగిశాయి. గతంకన్నా భిన్నంగా యువతను ఆకట్టుకోటానికి ఈ సారి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు రెహమాన్, గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, వందేమాతరం శ్రీనివాస్ తో పాటు సినీ గాయకులతో మూడు రోజుల పాటు నిర్వహించిన సంగీత విభావరి ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చివరి రోజు స్వరమాంత్రికుడు రెహమాన్ పాడిన పాటలు ఆకట్టుకున్నాయి... కాకినాడ... కాకినాడ... అంటూ, కాకినాడ పై రెహమాన్ పాడిన థీమ్ సాంగ్ హైలైట్ అయ్యింది... కింద వీడియోలో చూడవచ్చు...
ఎలా ఉన్నారు కాకినాడ... బాగున్నారా... అంటూ రెహమాన్ నోటి వెంట మాటలు రాగానే ఒక్కసారిగా తెలుగువారంతా ఉప్పొంగిపోయారు. కృతజ్ఞతగా కరతాళ ధ్వనులతో మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన దిల్ సే దిల్సే అంటూ హిందీ గీతాన్ని ఆలపించి సంగీతాభిమానుల పై తనకున్న ప్రేమను చాటారు. రెహమాన్ బృందంలో హరిచరణ్, జోషితా గాంధీలు కలిసి ప్రేమించే ప్రేమవా... ఊరించే ఊహవా అనే గీతాన్ని, జోషితా గాంధీ, గీతామోహన్లు కలిసి కొమరం పులి చిత్రంలోని నమ్మకమీయరా స్వామి... నిర్భయమీయరా స్వామి అంటూ ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి... నాని చిత్రంలోని పెదవే పలికిన మాటల్లోని తియ్మని మాటే అమ్మా అంటూ విజయప్రకాష్ తన గానామృతంలో కట్టిపడేశారు. ఈ సంద ర్భంగా రెహమాన్ బృందం మా తుఝే సలాం. ఊర్వశి ఊర్వశి టేకి టీజీ పాలసీ పాటలు ఆలపించి ఉత్సాహ పరిచారు.. రెహమాన్ పాడే సమయంలో బాణసంచా కాల్పులతో ఆ ప్రాంతం అంతా సంబరాలు నెలకొన్నాయి.
ఇక్కడ మరో విశేషం ఏంటి అంటే, సినీ రంగంలో సంగీత అరగ్రేటం చేసిన రెహమాన్ గురువారంతో 25 ఏళ్ల పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తనకు ఇక్కడ ఏపీ ప్రభుత్వం అవకాశం ఇచ్చి తెలుగు ప్రజల మధ్య పండుగ చేసుకోడానికి ఆహ్వానించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. 20 నిమిషాల సేపు పాటలు పాడిన తర్వాత వేదికపైకి అతిధులు వెళ్లి రెహమాన్ ను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆర్కెస్రా కొనసాగింది. సుమారు 90 మంది మ్యూజీషియన్స్, ఆరుగురు గాయకులు సంగీత విందు ఇచ్చారు.