మంత్రి లోకేష్ ని హేళన చేస్తున్న వారికి మరో బ్యాడ్ న్యూస్... తన పని తాను చేసుకుపోతూ, తానూ ప్రాతిన్ధ్యం వహిస్తున్న పంచాయితీ రాజ్ శాఖలో, దేశంలోనే టాప్ గా నిలిపి, ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే టాప్ లో నిలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన
మిషన్ అంత్యోదయ గ్రామ పంచాయతీ ర్యాంకింగ్స్ లో అగ్ర భాగాన ఆంధ్రప్రదేశ్ నిలిచింది... గ్రామాల సమగ్ర అభివృద్ధి ఆధారంగా మిషన్ అంత్యోదయ గ్రామ పంచాయతీ ర్యాంకింగ్స్ గ్రామాల్లో మౌలిక వసతులు, ఆర్థిక ప్రమాణాలు, పరిశుభ్రత, ఆరోగ్య ప్రమాణాలు, మహిళా సాధికారత తదితర అంశాల ఆధారంగా ర్యాంకింగ్స్ ఇస్తారు...
ఇప్పటి వరకూ వివిధ రాష్ట్రాల్లో ఉన్న 41,617 గ్రామ పంచాయతీలు తమ వివరాలను మిషన్ అంత్యోదయ వెబ్ సైట్ లో అప్లోడ్ చేసాయి. ఇప్పటి వరకూ ఇచ్చిన ర్యాంకింగ్స్ ప్రకారం ఉత్తమ 83 గ్రామాలకు మిషన్ అంత్యోదయ ర్యాంకింగ్స్ ఇచ్చింది . మిషన్ అంత్యోదయ కేటాయించిన ఉత్తమ 83 గ్రామ పంచాయతీల్లో 33 స్థానాలు సాధించి ఆంధ్రప్రదేశ్ కు చెందిన 33 గ్రామాలు ఆగ్ర స్థానంలో నిలిచాయి. ఉత్తమ పది గ్రామ పంచాయతీల్లో 7 స్థానాలను ఆంధ్రప్రదేశ్ దక్కించుకుంది. దేశ వ్యాప్తంగా ఇచ్చిన ర్యాంకింగ్స్ లో చిత్తూరు జిల్లా పరపట్ల గ్రామం 2వ స్థానం దక్కించుకుంది. విశాఖ జిల్లా చీడికాడ గ్రామానికి 3వ ర్యాంక్, తూర్పుగోదావరి జిల్లా కాజులూరు, కృష్ణా జిల్లా ఉంగుటూరుకు, చిత్తూరు జిల్లా ఎగువ తవనంపల్లి కి 4వ ర్యాంక్, కృష్ణా జిల్లా ఇందుపల్లి కి 5వ ర్యాంకు, చిత్తూరు కలికిరి కి 6వ ర్యాంకు సాధించి అగ్ర స్థానంలో నిలిచాయి.
నార్త్ ఇండియా కు చెందిన కేవలం 7 గ్రామాలు మాత్రమే ఉత్తమ 83 గ్రామాల లిస్ట్ లో స్థానం సంపాదించాయి. 33 గ్రామలతో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన, 21 గ్రామలతో తమిళనాడు, 6 గ్రామలతో కేరళ, 5 గ్రామలతో మహారాష్ట్ర, 4 గ్రామలతో తెలంగాణ ర్యాంకింగ్స్ వరుసలో ఉన్నాయి. మిషన్ అంత్యోదయ ప్రాధమికంగా సర్వే నిర్వహించి దేశ వ్యాప్తంగా 50 వేల గ్రామాలను ఉత్తమ పంచాయతీ ర్యాంకింగ్స్ కోసం ఎంపిక చేసింది. ఇప్పటి వరకూ వివిధ రాష్ట్రాలు 41,617 గ్రామాలకు సంబందించిన వివరాలు మిషన్ అంత్యోదయ వెబ్ సైట్ లో అప్లోడ్ చెయ్యగా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. మిగిలిన గ్రామాల వివరాలు ఇంకా అప్లోడ్ చేసే అవకాశం ఉంది. ర్యాంకింగ్స్ లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. 90 శాతం వివరాలు రావడం తో ఇప్పటి వరకూ జరిగిన సర్వే ఆధారంగా మిషన్ అంత్యోదయ ర్యాంకులను తమ వెబ్ సైట్ లో ఉంచింది.