కార్ల పై అందమైన చిత్రాలను గీస్తూ, స్థానిక సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే చిత్రకళకు ప్రచారం కల్పిస్తూ, దేశవ్యాప్తంగా సాగుతున్న కార్టిస్ట్ యాత్ర 2018, నేటి నుంచి విజయవాడలో ప్రారంభంకానుంది. దేశంలోని ప్రధాన నగరాలను కలుపుతూ సాగుతున్న ఈ యాత్రలో భాగంగా అమరావతి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే చిత్రాలను కార్ల పై గీయనున్నారు. స్థానికంగా ఉండే 30 మంది కళాకారులు, 20 మంది దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు కలిసి,అందమైన చిత్రాలను కార్లపై చిత్రీకరించనున్నారు.

cartist 22122017 2

దేశంలోని అనేక రాష్ట్రాలు, అక్కడి కళలు, సంస్కృతులను ప్రచారం చేసూ నవంబర్ 4వ తేదీ నుంచి ఈ యాత్ర సాగుతోంది. జైపూర్లో ప్రారంభమై ఇప్ప టికే అహమ్మదాబాద్ ముంబయి, పూణె, హైదరాబాద్, బెంగళూరుల్లో కార్యక్రమాలు నిర్వహించి. ప్రస్తుతం అమరావతికి చేరుకుంటోంది. విజయవాడలోని పీడబ్యూడీ మైదానంలో డిసెంబర్ 22, 23, 24వ తేదీల్లో ఈ చిత్రకళా ప్రదర్శన జరుగుతుంది. 121 రోజుల్లో దేశంలోని 18 ప్రధాన నగరాల మీదుగా, 9100 కిలో మీటర్ల దూరం కార్టిస్ట్ యాత్ర సాగనుంది. యాత్రలో భాగంగా వెయ్యి మంది కళాకారులు పాల్గొననున్నారు. ఎక్కడికక్కడ స్థానిక కళాకారులకు అవకాశం కల్పిస్తున్నారు. వెళ్లే దారిలో కనీసం రెండు కోట్ల మంది తిలకించేలా ప్రణాళికలు రూపొందించారు.

cartist 22122017 3

ప్రతి నగరంలో నిర్వహించే చిత్ర కళా ఉత్సవంలో కనీసం రెండు లక్షల మంది సందర్శకులు వచ్చేలా చేయాలనేది ప్రణాళిక. 2015లో జైపూర్కు చెందిన హిమాను జె, కార్టిస్ట్ యాత్రకు రూపకల్పన చేశారు. పాత ఆటోమొబైల్ వాహనాల పై చిత్రకళను గీస్తూ, ఆటోఆర్ట్ పేరుతో ప్రచారం కల్పించేందుకు ఈ యాత్రను ప్రారంభించారు. పాత కార్ల పై చిత్ర విచిత్రమైన పెయింటింగ్లను ఆకట్టుకునేలా చిత్రీకరించడం, అది కూడా స్థానిక కళలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం కార్టిస్ట్ యాత్ర ప్రధాన ఉద్దేశం. ఆసక్తి ఉన్నవాళ్లు తమ కార్లను తీసుకెళ్లి, అమరావతిని ప్రతిబింబించే చిత్రాలను ఉచితంగా గీయించుకోవచ్చు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read