ప్రతిపక్ష నేత జగన్ 2019లో ముఖ్యమంత్రి అయ్యి తీరాల్సిందే అంటూ పాదయాత్ర చేస్తున్నారు.. ఆయన అనుచరులు అయితే, 2019లో అధికారంలోకి రావటానికి చంపటానికైనా సిద్ధం అంటూ ప్రకటనలు ఇస్తున్నారు... సీన్ కట్ చేస్తే, అసలు ముందు 175 నియోజకవర్గాల్లో నిలబెట్టటానికి కాండిడేట్ లు కూడా దొరకటంలేదు.. కొన్ని జిల్లాల్లో అసలు చెప్పుకోతగ్గ అభ్యర్ధులే లేరు... ఇప్పుడు అలాంటి జిల్లాల సరసన ప్రకాశం కూడా చేరింది.. కర్నూల్, కడప లాగా, ఇది కూడా మాకు పట్టున్న జిల్లా అని జగన్ చెప్పుకుంటారు.. ఇప్పటికే కర్నూల్ లో జెండా పీకేసిన జగన్, ఇప్పుడు ప్రకాశంలో కూడా పీకటానికి రెడీగా ఉన్నాడు... ఇక జగన్ కు ప్రస్తుతానికి మిగిలింది కడప మాత్రమే...

jagan 06012018 1 1

ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి కుటుంబం నిర్ణయించుకోవడం వైసీపీకి ఇబ్బందికరంగా మారగా, ఇప్పుడు పర్చూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త గొట్టిపాటి భరత్‌ కూడా బూచేపల్లి బాటలో పయనిస్తున్నారు అనే సమాచారంతో జగన్ ఉలిక్కి పడ్డాడు... మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య కుమారుడైన భరత్‌ తండ్రి మరణానంతరం ప్రత్యక్ష రాజకీయ రంగప్రవేశం చేశారు. జగన్‌ ప్రోత్సాహంతో గత ఎన్నికల్లో పర్చూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. సుమారు 12వేల ఓట్ల తేడాతో ఆయన ఓటమి చెందారు...

jagan 06012018 1 1

అప్పటి నుంచి ఆక్టివ్ గానే ఉన్నారు... కాని గత ఆరేడు నెలలుగా ఆయన పనితీరులో వేగం తగ్గింది. రాజకీయ కార్యక్రమాలను ఆయన తగ్గించడం కూడా ఇందుకు కారణమైంది. జనవరి 1న కూడా కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడంతో అందరి దృష్టి ఆవైపునకు మళ్లింది. దీంతో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయలేనని పార్టీ అధినేత జగన్‌కు ఆయన చెప్పారన్న విషయం బయటకు వచ్చింది. ఆర్ధికంగా ఇబ్బందిగా ఉంది అని, ఆదుకోవాలని జగన్ ను కోరగా, సానుకూల స్పందన రాకపోవటంతో, రాజకీయాలకు దూరంగా ఉండాలి అని నిర్ణయించుకున్నారు... దీంతో ప్రకాశంలో ఇప్పటికే రెండు బలమైన నియోజకవర్గాల్లో టికెట్ ఎవరికి ఇవ్వాలో తెలియని పరిస్థితిలో జగన్ ఉన్నారు.. హేమాహేమీలే తప్పుకుంటే ఎలా అని జగన్ తల పట్టుకున్నారు... నియోజకవర్గ బాధ్యతలు ఎవరికో ఒకడికి ఇచ్చి, మమ అనిపించే కార్యక్రమంలో జగన్ ఉన్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read