రాష్ట్రంలో ఫేక్ బ్యాచ్ ల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు... ఇలా ఫేక్ చెయ్యటం కోసం, హైదరాబాద్ లో ఒక రాజకీయ పార్టీ కార్యలయమే పని చేస్తుంది... అలాగే అదే రాజకీయ పార్టీ, దేశంలోనే బాగా ఫేక్ చేసే సామర్ధ్యం ఉన్న వాళ్ళని సలహాదారులుగా పెట్టుకుని, విషం చిమ్మితున్న సంగతి తెలిసిందే... వీరికి ఎవరూ అడ్డు కాదు... అందరినీ ఫేక్ చేసే పడేస్తారు... ముఖ్యమంత్రి నుంచి మంత్రులు దాకా, ఎంపీ నుంచి వార్డ్ మెంబెర్ దాకా, ఇలా అందరినీ... ఇప్పుడు తాజాగా ఎఎస్ ల పేరుతో లెటర్లు సృష్టించి మరీ ఫేక్ చేస్తున్నారు...
శ్రీకాకుళం జిల్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మభూమి కార్యక్రమంలో పాల్గుని, ప్రతి ఇంటికి మరుగు దొడ్డి ఉండాలి అని, దాని కోసం ఐఎఎస్ లు కూడా ప్రజలను ఒప్పించి, పనులు అయ్యేలా చూడాలి అని, అలా కాని పక్షంలో, నేనే స్వయంగా వచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చుని ధర్నా చేస్తాను అని అన్నారు... ఇది ఆ ఇష్యూ పట్ల తాను ఎంత సీరియస్ గా ఉన్నాను అని తెలియచేయటానికి అలా మాట్లాడారు అనేది అందరికీ అర్ధం అవుతుంది.. అయితే ప్రజల్లో ముఖ్యమంత్రి మీద వ్యతిరేక తేవటానికి, ఒక ఫేక్ లెటర్ సృష్టించింది, ఈ ఫేక్ బ్యాచ్...
ఐ.ఎ.ఎస్ అధికారుల సంఘం పేరిట, వారి లెటర్ హెడ్ సింబల్ వేసే, ఐ.ఎ.ఎస్ లు అందరం మీ వ్యాఖ్యలు ఖండిస్తున్నాం అని, మీ పార్టీ నాయకులు బిల్లులు అన్నీ కొట్టేస్తున్నారు అనే విధంగా ఆ లెటర్ రాసి సోషల్ మీడియాలో ఫేక్ చేసారు... దీని పై, ఆంధ్రప్రదేశ్ ఐ.ఎ.ఎస్ అధికారుల సంఘం తీవ్రంగా స్పందించింది... "చంద్రబాబు తీరుపై ఘాటు లేఖాస్త్రం సంధించింది అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అది పూర్తిగా అవాస్తవం. ఐ.ఎ.ఎస్ అధికారుల సంఘం యెటువంటి ప్రకటనా చెయ్యలేదు" అంటూ శ్రీ యెల్ వీ సుబ్రహ్మన్యం, ఐ.ఎ.ఎస్ అధికారుల సంఘం అధ్యక్షులు, ఒక ప్రకటన విడుదల చేసారు.. ప్రభుత్వం కూడా ఈ విషయం పై సీరియస్ అయ్యింది.. ఇలా ఫోర్జరీ చేసిన వారు ఎవరు అనే విషయం పై ఆరా తీస్తుంది... సైబర్ క్రైమ్ సహాయంతో ఇది మొదట ఎక్కడ నుంచి బయటకు వచ్చింది అనే విషయం పై ఆరా తీస్తున్నారు...