మొన్నటి దాకా కేంద్రంలోని పెద్దలు, చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలి అని చూసారు... వాతావరణం చుసిన ప్రతి ఒక్కరికి, ఇక బీజేపీ, తెలుగుదేశం విదిపోయినట్టే అనే అంచనాకు వచ్చేసాయి... కాని ఊహించని విధంగా రెండు రోజుల నుంచి అన్నీ శుభవార్తలే వినిపిస్తుంది కేంద్రం... మొన్న పోలవరం విషయంలో కాంట్రాక్టర్ ను మార్చటానికి సరే అంది, పోలవరం కాఫర్ డ్యాం కట్టటానికి గ్రెన్ సిగ్నల్ ఇచ్చంది, చాలా రోజుల తరువాత మన ఎంపీలకు ప్రధాని మోడీ అప్పాయింట్మెంట్ దొరికింది, నిన్న కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటకు ముందడుగు అంటూ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసారు, చివరగా ముఖ్యమంత్రి చంద్రబాబుకి, ప్రధాని మోడీ అప్పాయింట్మెంట్ దొరికింది...

cbn 06012018 1

ఇవన్నీ ప్రజలకు ఆశ్చర్యానికి కలిగించాయి... ఇన్నాళ్ళు లొంగని కేంద్రం ఇప్పుడు ఎందుకు లొంగింది ? పోలవరం కాంట్రాక్టర్ ని మార్చమని చంద్రబాబు వేడుకున్నారు... రెండు నెలలు విలువైన సమయం వేస్ట్ అయ్యిన తరువాత, ఇవాళ సరే అన్నారు.. అలాగే కాఫర్ డ్యాం చాలా అవసరం అన్నారు చంద్రబాబు... కుదరదు అంది కేంద్రం... ఇవాళ సరే అన్నారు... అప్పుడు ఎందుకు ఆపారో, ఇప్పుడు ఎందుకు సరే అన్నారో వారికే తెలియాలి... కాని రెండు నెలలు సమయం వృధా అయ్యింది... ఇవన్నీ చూస్తున్న ప్రజలు, లోపల ఎదో జరిగింది అని అనుకుంటున్నారు... చంద్రబాబు ఎంతో ఒత్తిడి చెయ్యకపోతే, మోడీ, అమిత్ షా లాంటి వారి లొంగరు అని, చంద్రబాబు ఎదో గెట్టి దెబ్బ వేసారు అంటున్నారు....

cbn 06012018 2

లోపల జరిగింది మనం చెప్పలేము, చంద్రబాబు ఎలా ఒత్తిడి తెచ్చారో చెప్పలేం... బయటకు మాత్రం ఒక విషయం కనిపిస్తుంది.. అదే ట్రిపుల్ తలాక్ బిల్లు... ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభలోకి రాగానే తెలుగుదేశం పావులు కదిపింది... ఎన్డీఎ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ ట్రిపుల్ తలాక్ బిల్లు పై మిగతా ప్రతిపక్షాలతో ఏకమైనది... ట్రిపుల్ తలాక్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలి అని కోరింది... ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకం కాదు అని, దాంట్లో కొన్ని అంశాలు అభ్యంతరం అని చెప్పింది.. ఈ ఒక్క విషయం మాత్రం బయటకు కనిపిస్తుంది... నేషనల్ లెవెల్ లో చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నారు అనే సంకేతాలు వెళ్తే, అది బీజేపీకి రాజకీయంగా నష్టం కలుగుతుంది... ఈ విషయం బయటకు కనిపిస్తున్నా, ఇంకా ఎదో విషయం ఉండే ఉంటుంది అని, అందుకే మోడీ, అమిత్ షాలు ఇద్దరూ తలొగ్గారు అంటున్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read