ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, నీటి సంరక్షణ కోసం ఎంతలా తపిస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే... తాజాగా నదులు, చెరువులు, అన్నిటినీ పూజించాలి అంటూ, జలసిరికి హారతి అనే కార్యక్రమం కూడా మొదలు పెట్టారు.
జలసిరి కోసం, ప్రజలు అర్ధమయ్యే రీతిలో, పాటల రూపంలో కూడా కార్యక్రమాలు రూపొందించారు.. ఇందుకోసం, ప్రముఖ సినీ గేయ రచయిత అనంతశ్రీరామ్ కు బాధ్యతలు అప్పగించారు. తాను రచించిన పాట ముఖ్యమంత్రికి వినిపించటానికి, ప్రముఖ నేపధ్య గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ తో కలిసి అమరావతి వచ్చారు.
అయితే, చంద్రబాబు బిజీ షెడ్యూల్ కారణంగా, కడప జిల్లా ప్రయాణానకి చంద్రబాబు బయలుదేరుతున్న ఫ్లైట్ లోనే, ఇద్దరినీ రమ్మన్నారు ముఖ్యమంత్రి. విజయవాడ నుంచి కడప వెళ్తున్న ఫ్లైట్ లో, ముఖ్యమంత్రితో కలిసి, అనంతశ్రీరామ్, వందేమాతరం శ్రీనివాస్ ప్రయాణిస్తూ, ఆ సమయంలోనే ముఖ్యమంత్రికి పాట పాడి వినిపించారు.
చంద్రబాబు పుణ్యమా అని కడప గడపలో కాలిడడం, ఇక్కడి గాలిని పీల్చడం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు.
ప్రతి నీటిబొట్టు ప్రజల గొంతు తడపాలని, పైరుకు అందాలని ముఖ్యమంత్రి ఆశయమన్నారు. ఆ ఆశయం, సంకల్పంలో భాగంగా ఈ పాట రచించామని రాష్ట్రం సస్యశ్యామలం కావడంలో తమకు భాగస్వామ్యం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు అనంతశ్రీరామ్.