వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఅధ్యక్షుడు జగన్ విదేశీ పర్యటనకు వెళుతున్నారు. పెద్ద కుమార్తె హర్షను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చేర్పించేందుకు ఆయన లండన్ వెళుతున్నారు. కోర్ట్ పర్మిషన్ కూడా ఇచ్చింది.
అన్నీ బాగానే ఉన్నా, జగన్ కు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది. దాదుపుగా 12 రోజులు జగన్ లండన్ టూర్ ఉంటుంది. ఇంత క్లిష్ట పరిస్థుతుల్లో పార్టీని వదిలి ఇన్ని రోజులు జగన్ ఎందుకు వెళ్తున్నారో అర్ధం కావట్లేదు అంటున్నారు పార్టీ వర్గాలు... ఆయినే, ఈ 12 రోజులు పార్టీని ఎవరి చేతుల్లో పెట్టి వెళ్ళాలి అనేది, జగన్ తేల్చుకోలేక పోతున్నారు.
ఓ వైపు పార్టీ నేతల జంప్ చేస్తారని ప్రచారం, మరోవైపు వైఎస్సార్ కుటుంబం పేరుతో చేపట్టిన కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభం.. వచ్చే నెల నుంచి పాదయాత్ర కోసం రూట్ మ్యాప్.. ఇవన్నీ వదిలేసి, జగన్ వెళ్ళిపోతున్నారు... ఈ దశలో, పార్టీని ఎవరికీ అప్పచెప్పాలి అనేదాని మీద జగన్ గందరగోళానికి గురవుతున్నారు... విజయసాయి రెడ్డికి బాధ్యత ఇవ్వాలా ? లేక ప్రశాంత్ కిషోర్ కి ఇవ్వాలో తేల్చుకోలేకపోతున్నారు...
విజయసాయి రెడ్డి ఎక్కువగా ఢిల్లీలో ఉంటూ, ఢిల్లీ పెద్దలతో ఫోటోలు, బొకేలు ఇచ్చి వారిని కాకా పట్టే పని అప్పచెప్పారు... జగన్ కేసులు కీలక దశలో ఉన్న టైంలో, ఆయన ఢిల్లీ నుంచి వచ్చేస్తే, పెద్ద ప్రమాదమే జరుగుతుంది. అలా అని, ఈ ప్రశాంత్ కిషోర్ కి అప్పచేప్పితే, డబ్బులు ఇచ్చి పెట్టుకున్నోడు పార్టీని నడుపుతున్నాడు అనే సంకేతం వెళ్తుంది... షర్మిలకు అప్పచెప్పి వెళ్దాం అంటే, ఆవిడి స్పీడ్ చుస్తే, ఎక్కడ పవర్ సెంటర్ అవుతుందో అని జగన్ భయం... దీంతో ఏమి తోచని పరిస్థితిలోనే, జగన్ లండన్ ప్రయాణం అవుతున్నారు...