ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సకాలంలో జోక్యం చేసుకోవడంతో ఒక వ్యక్తి ఆత్మహత్య విరమించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడం కోసం కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి వచ్చారు. కేశవరెడ్డి విద్యా సంస్థలలో 5 లక్షల పెట్టుబడి పెట్టారు శ్రీనివాస్ రెడ్డి. కాని కేశవరెడ్డి విద్యా సంస్థలు మూత పడిన సంగతి తెలిసిందే..
అయితే ప్రస్తుతం తన పిల్లల గుండె జబ్బుల కోసం డబ్బులు లేక రోడ్డున పడ్డాడు శ్రీనివాస్ రెడ్డి. ముఖ్యమంత్రి దగ్గర గోడు వినిపించుకోవడం కోసం అమరావతి వచ్చారు. అదే విషయం అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి చెప్పారు శ్రీనివాస్ రెడ్డి. కాని తనిఖీ చేస్తున్న సమయంలో అతని దగ్గర పురుగుల మందు డబ్బా చూసి వెనక్కి పంపేసారు సిబ్బంది.
దీంతో శ్రీనివాస్ రెడ్డి మీడియాతో తన గోడు చెప్పుకున్నారు. అనంతపురం టూర్ లో ఉన్న ముఖ్యమంత్రి, మీడియాలో చూసి, వెంటనే తన కార్యాలయానికి ఫోన్ చేసి, బాధితుడిని ఆదుకోవాలంటూ ఆదేశించారు. ముఖ్యమంత్రి స్పందనతో అధికారులతో శ్రీనివాస్ రెడ్డి విషయం చెప్పారు. ప్రభుత్వం అతని పిల్లలకు అవసరమైన చికిత్స చెయ్యటంతో పాటు, కేశవరెడ్డి విద్యా సంస్థలలో పెట్టిన డబ్బులు కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తుంది.
ఒక వేళ చంద్రబాబు స్పందించకుండా ఉంటే, తను తెచ్చుకున్న పురుగులు మందు తాగి, ఆటను ఆత్మహత్య చేసుకునేవారు.. చంద్రబాబు సకలలంలో స్పందించటంతో, కుటుంబానికి పెద్ద దిక్కైన ఒక నిండు ప్రాణం నిలబడింది...