ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు మరోసారి మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు. ఇప్పటికే 1500 పెన్షన్ ఇస్తున్న వికలాంగులకి, ఉచితంగా హోండా యాక్టివా ఇవ్వనున్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మూడు చక్రాల బండి వేసుకుని తిరుగుతున్న వారికి, మూడు చక్రాల బండి స్థానంలో హోండా యాక్టివా మోటర్‌ సైకిళ్లనుఇవ్వనున్నారు.

తొలివిడతగా 2500 మందికి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. వికలాంగులకి వీలు పడేలా వీటి డిజైన్ ఉంటుంది. ఈ వాహనం ఖరీదు రూ.70వేల వరకు ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో దీనికోసం రూ.20కోట్లు ఖర్చు చేయనున్నారు.

ఇవి తీసుకోవాలి అంటే, దానికి ఉండాల్సిన అర్హతలు, నిబంధనలు ఖరారు చేయన్నున్నారు. వారిని ఎంపిక చేసేందుకు త్వరలోనే ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తారు. దానిద్వారా దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవచ్చు. నాలుగైదు రోజుల్లో అధికార ప్రకటన వెలువడనుంది.
అలాగే అంధులకు కూడా ప్రత్యేక ల్యాప్‌ట్యా్‌పలు, కంప్యూటర్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టనున్నారు. కీబోర్డుపై చేతితో టైప్‌ చేసే అక్షరాల శబ్దం వినిపించేలా వారికి శిక్షణ ఇచ్చిన అనంతరం వీటిని అందిస్తారు. అలాగే, మూగ, చెవిటివారికి సెల్‌ఫోన్లు ఇవ్వనున్నారు. వీడియో కాలింగ్‌ ద్వారా సంజ్ఞలతో మాట్లాడుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి.

సమాజంలో మేమేమి తాక్కువ కాదు అని వీరు అనుకోకుండా, వారి కాళ్ళ మీద వారు నిలబడుతూ, చిన్నచిన్న పనులు, వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా ఈ కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన ఉద్దేశం...

Advertisements

Advertisements

Latest Articles

Most Read