నవ్యాంధ్ర రాజధాని అమరావతికి మరో ప్రతిష్టాత్మక విధ్యా సంస్థ రానుంది. ఇప్పటికే SRM, VIT యూనివర్సిటీలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రతిష్టాత్మక వైద్య విజ్ఞాన సంస్థ అమరావతిలో ఏర్పాటు కానుంది.
ఇబ్రహీంపట్నం దగ్గర 20 ఎకరాల్లో అమరావతి అమెరికన్ ఆస్పత్రిని ఏర్పాటుచేసేందుకు ప్రవాసాంధ్రులు ముందుకొచ్చారు. మొత్తం మూడు దశల్లో రూ. 600 కోట్ల పెట్టుబడితో, 700 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. దీనిని 2019 మార్చి నాటికి మొదటి దశ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ ప్రతిష్టాత్మక వైద్య విజ్ఞాన సంస్థ నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 7వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు.
Advertisements