మనం మెట్రోలు, బులెట్ ట్రైన్ ల దగ్గరే, కేంద్రం వైపు ఆశగా చూస్తూ కూర్చుంటున్న టైంలో, చంద్రబాబు తన విజన్ ఏంటో చూపించారు... ప్రపంచంలోనే ఇప్పుడిప్పుడే వస్తున్న హైపర్‌లూప్ రవాణా వ్యవస్థను, భారత దేశంలోనే తొలి సారిగా ఆంధ్రప్రదేశ్‌లో పరిచయం చేయనున్నారు. మొన్నటి దాకా, ఈ వార్తలు చూసి అందరూ నవ్వారు... అమరావతి ఏంటి, హైపర్‌లూప్ ఏంటి అన్నారు... అయితే, స్వయంగా హైపర్‌లూప్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీస్ (HTT) ఈ విషయం ప్రకటించింది. అంతే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుండి విజయవాడ మధ్య హైపర్‌లూప్ మార్గాన్ని నిర్మించడానికి ఏపి ప్రభుత్వం హైపర్‌లూప్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీస్‌(HTT)తో అధికారికంగా భాగస్వామ్యపు ఒప్పందం కుదుర్చుకుంది. ప్రయివేట్ ఇన్వెస్టర్ల నుండి నిధులు సేకరించి ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంతో అమరావతి మరియు విజయవాడ నగరాలను కలిపే విధంగా హైపర్‌లూప్ మార్గాన్ని నిర్మించడానికి ప్రభుత్వ మరియు HTT సంస్థలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

మొదటి ఫేజ్‌లో భాగంగా మొదటి ఫేజ్‌లో భాగంగా ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను ఆక్టోబర్, 2017 నుంచి 6 నెలల పాటు హైపర్‌లూప్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీస్ అధ్యయనం చేయనుంది.

రెండవ ఫేజ్‌లో భాగంగా... రెండవ ఫేజ్‌లో భాగంగా ప్రాజెక్ట్ పనులు పట్టాలెక్కుతాయి. భారతదేశంలో హైపర్‌లూప్ రవాణా వ్యవస్థ ఏర్పాటుకు కుదిరిన మొట్టమొదటి ఒప్పందం ఇదే కావటం విశేషం.

భారత్‌దేశంలోనే తొలి హైపర్‌లూప్ నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల ఆనందంగా ఉందని హైపర్‌లూప్ ట్రాన్స్‌పోర్ట్ టెక్నాలజీస్ ఛైర్మెన్ మరియు కో-ఫౌండర్ బిబోప్ గ్రెస్టా తెలిపాడు.

ప్రపంచంలోనే, మొట్టమొదటి హైపర్‌లూప్ రవాణా వ్యవస్థను, ముందుగా లాస్ ఏంజిల్స్‌ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వరకు 610 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయనున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read