చంద్రబాబుకి నంద్యాల విజయం కంటే, కాకినాడ విజయం చాలా స్పెషల్... 30 ఏళ్ళ తరువాత కాకినాడ కార్పొరేషన్ లో, జెండా ఎగరేసింది తెలుగుదేశం... అయితే, చంద్రబాబు తెలుగుదేశం పార్టీ పగ్గాలు తీసుకున్నాక, కాకినాడ కార్పొరేషన్ ఇప్పటి వరకు గెలవలేదు.
తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తరువాత, 1987లో మొదటి సారి తెలుగుదేశం పార్టీ కాకినాడ కార్పొరేషన్ గెలిచింది. అప్పుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉన్నారు.
1995లో, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2000వ సంవత్సరంలో కూడా, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2005లో కూడా వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది.
కాని ఈ సారి, తెలుగుదేశం భారీ ఆధిక్యంతో 30 ఏళ్ళ తరువాత గెలిచింది. కళ్ళ ముందు కాకినాడ అభివృద్ధి, స్మార్ట్ సిటీ పనులు, కాపులకు చంద్రబాబు అండగా ఉండటం, ఇవన్నీ కలిసి వచ్చాయి. మరో పక్క జగన్ ఉండటంతో, అతన్ని నమ్మే పరిస్థుతుల్లో ప్రజలు లేకపోవటం, తెలుగుదేశం పార్టీకి ఇంకా ఈజీ అయిపొయింది.