ఇటీవల కాలంలో వైఎస్ జగన్ ఎక్కడకెళ్లినా, ఒక కథ చెబుతున్నారు. సినిమాలో విలన్ చివరి రీల్ వరకూ పైచేయి సాధిస్తాడు.. హీరో చివరి రీల్లో వచ్చి విలన్ ఆట కట్టిస్తాడు అని చెప్పిందే చెప్పి రీల్ అరగదీసేస్తున్నాడు.
250 కోట్ల డీల్‌తో మాట్లాడుకున్న బీహారి బాబు ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన కథ ఇదని, అందుకే జగన్ దీన్ని వదలడంలేదని మరో కథనం ప్రచారంలో ఉంది.
సరే ఇప్పుడు రీల్, రియల్ విలన్ ఎవరో తేలిపోయింది.
2019కి సెమీఫైనల్స్ అని, రెఫరెండం అని, చంద్రబాబుకు నాకు మధ్య పోటీ అని నోటికొచ్చినట్టల్లా మాట్లాడిన జగన్‌ను..రియల్ విలన్ అని నంద్యాల వాసులు నిర్ణయించేశారు. రీల్ లైఫ్‌లో డబ్బుతో తెచ్చిపెట్టుకున్న గూండాలు...విలన్ చుట్టూ ఉంటారు. మంచి పనులు, ప్రజోపయోగ కార్యక్రమాలు నచ్చి మెచ్చేప్రజలు కథనాయకుడి వెంట ఉంటారు.
నంద్యాలలో 2014లో 3000 పైచిలుకు ఓట్లతో జగన్ పార్టీ గెలిచింది. 2017లో వైసీపీ అభ్యర్థికి వచ్చిన 3000 పోయింది..తెలుగుదేశానికి 27000 పై చిలుకు మెజారిటీ వచ్చింది. అంటే దాదాపు మూడేళ్లలో 30 వేల మంది అభిమానుల్ని సంపాదించుకున్న చంద్రబాబు రియల్ హీరో అయితే... రీల్లో చివరన హీరోగా వస్తానని పదే పదే చెబుతున్న జగన్‌ని నువ్వే రియల్ విలన్‌వి అని నంద్యాల జనాలు ఛీకొట్టి పంపారు.
అమరావతి రాజధానిని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పక్క రాష్ర్ట పాలకులతో కలిసి అడ్డుకుంటున్న జగన్‌కి నంద్యాల నాందిగా రాష్ర్టమంతా ఇదే రీతిగా బుద్ధి చెప్పబోతోందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. నంద్యాల అనే క్లైమాక్స్‌లో అడ్డంకుల్ని అధిగమించి విలన్ అయిన జగన్‌ని మట్టి కరిపించిన రియల్ హీరో చంద్రబాబుకు జనం జేజేలు పలుకుతున్నారు.