మనం కొంత మంది రాజయకీయ నాయకుల గురించి చెప్పిన మాటలు వింటూ ఉంటాం.. నమ్ముకున్నోళ్ళ కోసం ఎంత దూరం అయినా వెళ్తారు అని... నమ్ముకున్నోళ్ళ చేస్తే ఉపయోగం ఏమి ఉంటుంది, ప్రజల కోసం చెయ్యాలి కాని... చంద్రబాబు నమ్ముకున్నోళ్ళ కోసం ఏమి చేశారో కాని, ప్రజల కోసం చేసేది మట్టికి కనపడుతూనే ఉంటుంది. కాని ఈ సంఘటన మనకు ఇప్పటి వరకు తెలీదు...
ఇది ట్విట్టర్ వేదికగా, SVR మూర్తి అనే ఒక సామాన్యుడు ట్వీట్ చేసింది. చంద్రబాబు సామాన్య ప్రజల సమస్యలు ఎలా, ఎంత వేగంగా పరిష్కరిస్తారు అనేదానికి ఒక ఉదాహరణ.
నిన్న కాకినాడ విజయం తరువాత, ట్విట్టర్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ధన్యవాదాలు చెప్తూ, ఒక ట్వీట్ చేశారు. దానికి SVR మూర్తి అనే ఒక సామాన్యుడు స్పందిస్తూ, "నేను మీకు 1999 నుంచి అభిమానిగా మారిపోయాను. దానికి కారణం మన దేశం కోసం పోరాడుతున్న ఒక వీర సైనికుడు చెప్పిన విషయం. దక్షిణ్ ఎక్ష్ప్రెస్స్ ట్రైన్ లో, వెళ్తూ ఉండగా ఒక సైనికుడు కార్గిల్ యుద్ధానికి నాతొ పాటే ట్రైన్ లో ప్రయాణం చేశారు. అప్పుడు ఆయన మీ గురించి చెప్తూ, 25 పైసల పోస్ట్ కార్డు లో, మా వ్యవసాయ భూమి కొంత మంది రాజకీయ నాయకులు ఖబ్జా చేశారు అని రాసిన కొన్ని రోజులకే, మా నాన్న గారికి ఫోన్ చేసి, మీ భూమి నుంచి వారు వెళ్ళిపోయారు, ఈ భూమి మీదే అని అధికారులు చెప్పారు. 25 పైసల పోస్ట్ కార్డుతో, చంద్రబాబు చేసిన వండర్ ఇది" అని SVR మూర్తి ట్వీట్ చేశారు.
ఇది చంద్రబాబు గురించి మనకు తెలియని మరో కోణం... సమస్య ఉంది అని ఆయన దృష్టికి వెళ్తే, సమస్యను బట్టి వీలైనంత తొందరగా పరిష్కరిస్తారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ...