వంగవీటి రంగా మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఆఫిషియల్ స్పోక్స్ పర్సన్ విజయవాడ నేత గౌతంరెడ్డిని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు వైఎస్ జగన్ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
పార్టీలో క్రమశిక్షణ తప్పితే, పార్టీకి నష్టం అని, ఎవరికైనా ఇలాంటి శిక్ష తప్పదు అని జగన్ చెప్పారు. ఇక్కడ వరకు బాగనే ఉంది కాని, వైసీపీ శ్రేణులు ఈ విషయంలో అయోమయంలో ఉన్నాయి.
గౌతం రెడ్డి అంటే విజయవాడలో పెద్దగా ఎవరికీ తెలీదు... ఆయన ఏమన్నా, పార్టీకి వచ్చే పెద్ద నష్టం ఏమీ లేదు... కాని ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి, ఆక్షన్ తీసుకున్నారు... మరి రోజా, జగన్ నోటి దురుసు వల్ల, కాకినాడ, నంద్యాల ఎలక్షన్ లో చిత్తూగా వైసీపీ ఓడిపోయింది.... రోజా అయితే, మేమేమి దళితులం కాదు, మమ్మల్ని పట్టుకోవచ్చు అంటూ, దళితులని కించపరిచినప్పుడు, జగన్ ఒక్క మాట కూడా మాట్లడలేదు... అలాగే పవన్ కళ్యాణ్ మీద కూడా వ్యక్తిగతంగా ఏంతో దూరం వెళ్లి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి..
బయటివారిని తిట్టినప్పుడు తప్పుగా కనిపించని జగన్ కు... ఎదుటివారిని తిట్టమని మారి చెప్పి తిట్టించి సంతోషపడే జగన్ కు... గౌతమ్ రెడ్డి ఆరోపణలు ఎందుకు భాదకలిగాయో అని అయోమయంలో ఉన్నాయి వైసీపీ శ్రేణులు... నోటి దురుసుతో పార్టీని నాకించిన జగన్ రెడ్డి, రోజా రెడ్డి ని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని గౌరవాధ్యక్షురాలు విజయమ్మని డిమాండ్ చేస్తున్నాయి వైసీపీ శ్రేణులు...