తల్లిదండ్రులు, తోబుట్టువులను కోల్పోయి అనాధిగా మారిన అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి చెందిన చిన్నారి లక్ష్మీ ప్రసన్నకు ముఖ్యమంత్రి చంద్రబాబు బాసటగా నిలిచారు. తాడిపత్రిలో నివాసం ఉండే రామసుబ్బారెడ్డి, జులై 4వ తేదీ తెల్లవారు జామున 4.౩0 గంటల ప్రాంతంలో భార్య సులోచనాదేవిని అతిక్రూరంగా చంపి ఆ తర్వాత ఇద్దరు కుమార్తెలు ప్రత్యూష (21), సాయిప్రతిభ(19)లపై సుత్తితో దాడిచేసి హతమార్చాడు. ఆ తర్వాత ఆయన క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

చెడువ్యసనాలకు బానిసై అప్పలు చేసి, ఆ అప్పలు తీర్చేందుకు తన పేరు పై ఉన్న వ్యవసాయ భూములను విక్రయించేందుకు ప్రయత్నించాడు. ఇందుకు ఆయన భార్య అడ్డు తగిలారని ముగ్గురు కుమార్తెల వివాహాలు ఎలా చేస్తారని ప్రశ్నించడంతో ఉద్రేకం పెంచుకున్న రామసుబ్బారెడ్డి ఒక పథకం ప్రకారం భార్యా ఇద్దరు కుమార్తెలను హతమార్చి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని కనగనపల్లి మండలం ముక్తాపురం గ్రామంలో నిర్వహించిన రైతు కృతజ్ఞతా సభకు చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సభకు రామసుబ్బారెడ్డి కుమార్తె లక్ష్మీప్రసన్న హాజరై తన తండ్రి తనను అనాధ చేశారని, తల్లితో పాటు ఇద్దరు చెల్లెలను చంపి తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె సీఎంను కలిసి విన్నవించుకున్నారు. లక్ష్మీప్రసన్నను చదివించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని ఆమెకు వివాహం చేసే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదని అప్పుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం లక్ష్మీప్రసన్నపేరుపై రూ.20 లక్షలను ఫిక్షెడ్ డిపాజిట్ చేస్తుందని ప్రకటించారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లక్ష్మీప్రసన్నపేరు పై ఈ డిపాజిట్ చేయాలని సభావేదిక పై ఉన్న జిల్లా కలెక్టర్ ను సీఎం ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాలతో లక్ష్మీప్రసన్నపేరుతో గురువారం ఫిక్షెడ్ డిపాజిట్ ను బ్యాంకుద్వారా తయారు చేయించి ఆమెకు అందజేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read