రాష్ట్రాన్ని కరువురహితంగా తీర్చిదిద్ది, వ్యవసాయానికి స్వర్గధామంగా మార్చాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను విస్తృతంగా నిర్మిస్తోంది. జలసిరికి హారతి కార్యక్రమంలో భాగంగా చింతలపూడి ఎత్తిపోతల పథకం రెండో దశ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. మొట్ట ప్రాంత రైతుల చిరకాల సాగునీటి కల నేరవేర్చడానికి చింతలపూడి ఎత్తి పోతల పదకం రెండవ దశ పనులకు సంబందించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాటు నాయుడు, రెడ్డి గూడెం మండలం మద్దుల పర్వ గ్రామంలో ఏర్పాటు చేసిన పైలాన్ ను గురువారం ఆవిష్కరించారు.

ఇప్పటికే రూ.1701 కోట్లతో చింతలపూడి ఎత్తిపోతల పథకం మొదటి దశ పనులు శరవేగంగా సాగుతున్నాయి.మొత్తం రూ. 4,909,80కోట్లతో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు గోదావరి జలాలు తరలించాలని ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. 15 ఏళ్ల నుంచి నాగారునసాగర్ ఎడమ కాలువ 3వ జోన్ పరిధిలో ఉన్న 18 మండలాలకు చెందిన 2.10లక్షల ఎకరాలకు సాగునీరు పూర్తిస్తాయిలో ఆందడంలేదన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రారంభం కావడం ద్వారా ద్వారా ఆ ప్రాంత రైతులకు సాగునీటి కషాలు తీరనున్నాయి. ఈ పధకం ద్వారా 410 గ్రామంలోని 21 లక్షల జనాభాకు త్రాగునీరు సౌకర్యం కల్పించబడుతుంది.

గోదావరి జలాల ఎత్తిపోతల తీరిది
చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తయితే, కృష్ణా, పశ్చిమ గోదారి జిల్లాలకు గోదావరి జలాలు తరలించొచ్చు. ఈ పథకం ద్వారా గోదావరి జలాలు రెండు దశల్లో ఎత్తిపోయనున్నారు. మొదటి దశలో పశ్చిమ గోదావరి జల్లాలోని తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామం వద్ద లీడింగ్ ఛానల్ ద్వారా గోదావరి జలాలను పంపించనున్నారన్నారు. ఆక్కడి నుంచి 13.22కిలోమీటర్ల దూరంలో ఉన్న గోపాలపురం మండలంలోని గుడ్డిగూడెం గ్రామినికి గోదావరి జలాలు చేరుకుంటాయి. అక్కడ రెండో దశ పథకం కింద లిప్ట్ ఏర్పాటు చేశారు. అక్కడ 14 పంపులు ఏర్పాటు చేసి వాటి ద్వారా 92 మీటర్లు ఎత్తులో ఉన్న చింతలపూడి ఎత్తిపోతల ప్రధాన కాలువలోకి గోదావరి జలాలను ఎత్తిపోతలు చేస్తారు. అదే సమయంలో ప్రధాన కాలువ సామర్ధ్యం పెంచి, నాగార్శన సాగర్ ఎడమ కాలువ 21 బ్రాంచి కెనాల్ కు ఆనుంధానించి, కృష్ణా జిల్లాలోని నిర్దేశిత ఆయకట్టకు సాగునీరు అందించనున్నారు.

పథకంతో కలిగే ఉపయోగాలు
చింతలపూడి ఎత్తిపోతల పథకం కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 9 నియోజకవర్గాల్లోని 33మండలాలకు చెందిన 2 లక్షల ఎకరాకలకు కొత్తగా సాగునీరు ఆందనుందన్నారు. అలాగే రూ.2.80, లక్షల ఎకరాలకు స్థిరీకరణ జరగనుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వాడ కాలువ ప్రాజెక్టు పరిధిలో గల 17వేల ఎకరాలు, ఎర్ర కాలువ ప్రాజెక్టు కింద ఉన్న 28వేల ఎకరాలతో పాటు తమ్మిలేరు ప్రాజెక్టు పరిధిలో ఉన్న పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాలోని మరో 25వేల
ఎకరాల ఆయకట్ల స్థిరీకరణ జరగనుంది. వాటితో పాటు కృష్ణా జిల్లాలో ఉన్న 200 చెరువులను నింపడం 50 వేల ఎకరాలతో పాటు నాగార్జునసాగర్ కాలువలపై నిర్మించిన చిన్ననీటి ఎత్తిపోతల పథకాల కింద ఉన్న మరో 10వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.

ఈ రెండు దశల వల్ల భూగర్భ జలాల మట్టం పెరిగి, బోర్ల ద్వారా మరిన్ని ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి రానుంది. కేవలం సాగునీరు అందివ్వడమే కాకుండా చింతలపూడి ఎత్తిపోతల ధ్వారా తాగునీరు రౌతు గూడెం, రెడ్డిగణపవరం గ్రామాల మధ్య 3వ లిఫ్ట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ లిఫ్ట్ దగ్గర 6 పంపులను ఏర్పాటు చేసి, అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న జల్లేరు వాగుపై 20టీఎంసీల సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న జలాశయానికి నీటిని ఎత్తిపోతల ద్వారా తరలించనున్నారు. ఈ నీటిని సాగుతో పాటు తాగునీటి అవసరాలకూ వినియోగించనున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read