తండ్రిలా రాష్ట్రాన్ని కాపాడుతున్నారు... మరి పిల్లలకి హాని చేస్తే ఊరుకుంటారా ? ఊరి కాని ఊరిలో చదవుకుంటానికి వెళ్ళిన పిల్లలను ఇబ్బంది పెడితే, బాగోదు అని వార్నింగ్ కూడా ఇచ్చారు... మీకు నేనున్నా అంటూ, మన పిల్లకి భారోసా ఇచ్చారు...
కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీలో రైల్వే, బ్యాంకింగ్ పరీక్షలు రాసేందుకు వెళ్లిన తెలుగు విద్యార్థులను అక్కడి కన్నడ సంఘాల నేతలు అడ్డుకున్నారు. విద్యార్థులను పరీక్షా హాల్ వద్ద అడ్డుకొని హాల్ టికెట్లు చించివేశారు. అంతేగాక, కొందరు తెలుగు విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు రంగప్రవేశం చేసి కన్నడ సంఘాల నేతలను అడ్డుకున్నారు. కన్నడిగుల తీరుతో సుమారు వెయ్యి మంది వరకు తెలుగు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
విషయం తెలుసుకున్న చంద్రబాబు, కర్ణాటకలో తెలుగు విద్యార్ధులపై దాడి అంశంపై కర్ణాటక సీఎస్, డీజీపీ, కేంద్ర హోంశాఖ అధికారులతో మాట్లాడాలని సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్‌చంద్రను ఆదేశించారు. అంతేగాక అవసరమైతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్రప్రభుత్వంతో మాట్లాడతానని చంద్రబాబు పేర్కొన్నారు. మా పిల్లల జోలికి రాకుండా చూడాలి అని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు.
సెప్టెంబర్ 10, 16,17, 24 తేదీల్లో జరిగే పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు రక్షణ కల్పించే చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించారు. కర్ణాటకలో జాతీయ పోటీ పరీక్షలు రాసే తెలుగు విద్యార్ధులు ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు.