నదుల అనుసంధానంలో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇనాస్టక్చర్స్ లిమిటెడ్ తనదైన శైలిలో రికార్డులు సాధిస్తోంది. ఇన్ఫ్రా రంగంలో హైదరాబాద్ కేంద్రంగా దేశ, విదేశాల్లో మేఘా అభివృద్ధి పధంలో దూసుకుపోతోంది. నదుల అనుసంధానంలో మూడు ప్రాజెక్ట్ లను స్వల్ప కాలంలోనే పూర్తి చేసిన ఘనతను ఈ సంస్థ సొంతం చేసుకుంది.
2015లో గోదావరి-కృష్ణా నదుల అనుసంధానానికి పట్టిసీమ ఎత్తిపోతల పధకం నిర్మా ణంలోనూ మేఘా "లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్" లోకి ఎక్కింది. రికారు స్థాయిలో 168 రోజుల్లోనే తొలి విడత కింద కృష్ణా నదికి నీటిని పంపింగ్ చేసింది. ఆ తర్వాత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు గడువను పొడిగించకుండా 2016 మార్చి 29టి నాటికి పూర్తి చేసి గోదావరి-క్టషా నదుల అనుసంధానంలో సరికొత్త చరిత్రను రాసింది.
మొన్న ఈ సంస్థ నిర్మించిన గోదావరి-ఏలేరులను అనుసంధానం చేసే పరుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. దీనికి ఒప్పందం లేకపోయినా సీఎం నిర్దేశించిన లక్ష్యం మేరకు స్వాతంత్ర్య దినోత్సవం నాటికి మొదటి దశలో రెండు పంపుల ద్వారా నీటిని గోదావరి నుంచి ఏలేరుకు మేఘా తరలించగలిగింది. ఆరు నెలల్లోనే అడ్డంకులను అధిగమించి మేఘా పనులు పూర్తి చేసింది.
ఇప్పడు తాజాగా ముచ్చుమర్రి (హంద్రీ-నీవా సుజల స్రవంతి) వద్ద మరో స్కీంను పూర్తిచేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం కర్నూలు జిల్లా ముచ్చుమర్రి గ్రామం వద్ద హంద్రీ-నీవా సుజల స్రవంతి మొదటి దశ, రెండో ప్యాకేజీలో భాగంగా మేఘా సంస్థ నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్నారు.