వృక్షోరక్షతి రక్షతః అని నానుడి. ఒక మొక్క నాటితే వంద మందికి వంద లాభాలు చేసి పెడుతుంది. అలాంటిది కొన్ని మహావృక్షాలు ఎన్ని లాభాలు పంచిపెడతాయో కదా?
రహదారుల విస్తరణలో భాగంగా వీటిని తొలగించుట బాధాకరమైప్పటికీ అభివృద్ది జరిగేటపుడు కొన్ని కోల్పోవాల్సిన అవసరం ఉంది. ఆంగ్లములో ఒక జాతీయము ఉంది " Development has its own side effects" అంటే అభివృద్ది జరిగేటపుడు కొన్ని దుష్ప్రభావలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది... కానీ వీటికి ప్రత్యామ్న్యాయ మార్గాలను మనం అనుసరించవలసిన అవసరం ఎంతైనా ఉంది!!!
మనలో చాలామంది గమనించే ఉంటారు!!! విజయవాడ - మచిలీపట్నం రహదారి విస్తరణలో దశాబ్దాల నాటి భారీ వృక్షాలను నరికివేసినప్పటికీ, మీ కోసం మేమున్నాం అంటూ దాదాపు పది పదిహేను రోజులలో వాటి మోడులు మళ్ళీ చిగురించాయి... పర్యావరణ ప్రేమికులు వీటిని చూసి చాలా బాధపడి ఉంటారు????
ఈ స్పృహ ఉంది కాబట్టే మన పెనమలూరు శాశనసభ్యుడు శ్రీ బోడె ప్రసాద్ గారు కొన్ని మహా వృక్షాలను రోడ్ వెడల్పు పనులలో భాగంగా నరికివేయకుండా జాగ్రత్తగా ఇంకో ప్రదేశానికి తరలించి కాపాడారు. బోడె ప్రసాద్ గారు తన సొంత ఖర్చులతో, దాదాపుగా లక్ష రూపాయలు ఖర్చు పెట్టి, వీటిని ఒక కాలువ గట్టుకు తరలించి, అక్కడ నాటారు. విదేశాలలో ఇలాంటివి సాధారణంగా చేస్తుంటారు. అయితే మన రాష్ట్రంలో ఈ సంప్రదాయానికి తెరతీసిన శ్రీ బోడె ప్రసాద్ గారు అభినందనీయులు.
నేటి ముఖ్య దినపత్రికలలో ఈ వార్త ప్రచురణ చాలా ఆనందదాయకము... ఇంటర్నేషనల్ ఛానల్ అయిన BBCలో కూడా ఈ వార్తా వచ్చింది.... ప్రపంచం మొత్తం, MLA చేసిన పనిని మెచ్చుకుంటున్నారు... ఇది మరికొంతమందికి ప్రేరణ కలిగిస్తుందని భావిద్దాం... మరికొంతమంది ఈ వృక్షాలను ట్రాన్స్ ప్లాంటేషన్ పద్దతి ద్వారా వేరే ప్రదేశాలకి తరలించి భావి తరాలకు మంచి పర్యావరణ పరిస్థితులను కల్పించుటకు సహాకారం అదించగలరని భావిద్దాం... అలాగే, ప్రభుత్వాలు కూడా ఈ పద్ధతులని అనుసరించాలి అని, ఆశిస్తూ!!!!!!
గాలి, నీరు, నేల, అందమైన ప్రకృతి మన పూర్వీకుల నుండి లభించిన వారసత్వ సంపద కాదు! మన భావి తరాల నుండి పొందిన అప్పు!! వీటిని వారికి జాగ్రతగా తిరిగి ఇవ్వవలసిన అవసరం మనపై ఎంతైనా ఉంది..
BBC న్యూస్ లింక్ ఇక్కడ చూడచ్చు... http://www.bbc.com/news/world-asia-india-39856595