నిర్మాణరంగ దిగ్గజం అపర్ణ గ్రూప్‌లో తాజాగా ప్రీమియం టైల్స్ తయారీ విభాగంలోకి ప్రవేశిస్తోంది. మూడు దశాబ్దాలుగా టైల్స్‌ పంపిణీ అనుభవంతో సొంతంగా ఉత్పత్తి కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కాకినాడ సమీపంలో పెద్దాపురం వద్ద ఏర్పాటు చేయనుంది. రూ.320 కోట్లతో టైల్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. అత్యాధునికంగా నెల కొల్పిన ఈ ప్లాంట్‌లో డబుల్‌ చార్జ్ విట్రిఫైడ్ ఫ్లోర్ టైల్స్ ఉత్పత్తి చేయనున్నట్లు గ్రూప్ మంగళవారం వెల్లడించింది. ప్రత్యేక బ్రాండ్‌ కింద వీటిని త్వరలో మార్కెట్లోకి తేనున్నట్లు తెలిపింది.

ఈ టైల్ యూనిట్లో రోజుకు 1.75 లక్షల ఒక చదరపు అడుగు పలకలను ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో రూ 200 కోట్ల పెట్టుబడి పెట్టినట్టు ఆయన చెప్పారు. వచ్చే ఏడాది ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఇది రెట్టింపు అవుతుందని, సుమారు రూ. 600 కోట్ల రెవెన్యూ అంచనా వేస్తున్నామని గ్రూప్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.ఎస్.రెడ్డి చెప్పారు.

ప్రస్తుతం రూ.1300 కోట్ల టర్నోవర్‌ కల్గిన అపర్ణా గ్రూప్‌.. వ్యాపార విస్తరణతో 2020కి రూ.2500 కోట్లకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాణ రంగం వాటా ప్రస్తుతం రూ.800 కోట్లని.. కొత్త ప్రాజెక్ట్‌లతో వచ్చే మూడేళ్లలో రూ.1300 కోట్ల నుంచి రూ.1400 కోట్లకు చేరుకుంటుందన్నారు. నిర్మాణ సామాగ్రి యుపీవీసీ కిటికీలు, రెడీమిక్స్‌ కాంక్రీట్‌, టైల్స్‌ మార్కెటింగ్‌తో అపర్ణా ఎంటర్‌ప్రైజెస్‌ ప్రస్తుత రూ.500 కోట్ల టర్నోవర్‌ నుంచి టైల్స్‌ ఉత్పత్తితో మూడేళ్లలో రూ.1200 కోట్లకు చేరుకుంటామని ఆశిస్తున్నట్లు ఎస్.ఎస్.రెడ్డి చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read