ఇంటర్మీడియట్‌, ఎంసెట్‌లలో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లి దండ్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ అనుభవాలను, లక్ష్యాలను తెలియజేశారు.

‘సర్‌, మాది బాగా వెనుకబడిన జిల్లా ప్రకాశం... ఇప్పటిదాకా మా ఊరికి మంత్రి కూడా రాలేదు. కానీ, ఇంటర్‌లో నాకు ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చిందని తెలియగానే మంత్రి గంటా శ్రీనివాసరావు నాకు ఫోన్‌ చేసి అభినందించారు. మీరు కూడా నాకు కంగ్రాట్స్‌ చెప్పారు. మీ పరిపాలన చూస్తున్నాను, మీరు ప్రజల కోసం నిరంతరం ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నాను, మీరే నాకు ఇన్స్పిరేషన్... ఐఏఎస్‌ కావాలన్నది నా లక్ష్యం. ఐఏఎ్‌సగా మీ పరిపాలనలోనే పని చేస్తాను’’ అని ఇంటర్‌ (ఎంపీసీ)లో మొదటి ర్యాంక్‌ సాధించిన షేక్‌ షర్మిలా తెలిపింది.

అలాగే తనకు బిట్స్‌ పిలానీలో చదువుకోవాలని ఉందని, తమది పేద కుటుంబమని, చదువుకి 25 లక్షలు ఖర్చు అవుతుంది అని, ప్రభుత్వం తరుపున ఎమన్నా సాయం చేయాలని కోరింది. దీంతో ఆమె చదువుకయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.

చదువుకోవాలన్న తపన ఉండి.. ప్రతిభ చూపే విద్యార్ధులకు తమ ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని.. అలాంటి విద్యార్ధుల ఉన్నత చదువుల కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

షేక్‌ షర్మిలా, మాట్లాడిన మాటలు మీరూ వినండి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read