Sidebar

12
Mon, May

cbn ap growth rate 08122016

మన రాష్ట్రం, ఈ సంవత్సరం తొలి ఆరు నెలల్లో 12.23 శాతం మేరకు వృద్ధి సాధిచింది అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. సగం పాలన పూర్తి చేశానని, హాఫ్ ఇయర్లీ పరీక్ష పెట్టుకున్నామని, ఇక నుంచి ప్రతి మూడు నెలలకు ఫలితాల ప్రకటిస్తామని తెలిపారు. రాష్ట్రాన్ని ఆభివృద్ధిపధంలో నడపడమే లక్ష్యంగా కష్టపడి పని చేశామని, ఫలితం కూడా ఆశాజనంగా ఉందన్నారు. మేము కష్టాన్నే నమ్ముకున్నాం, రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపి తీరుతామన్నారు. తన పాలన రెండున్నర్ర ఏళ్ళు పూర్తయిన సందర్భంగా, వెలగపూడిలోని సచివాలయంలో సీఎం విలేకరులతో మాట్లాడారు.

ఈ ఏడాది తొలి 6 నెలల్లో వృద్ధి రేటు 12.23 శాతంగా లెక్కతేలింది. అదే జాతీయ స్థాయిలో 7.2 శాతమే వృద్ధి నమోదైంది ఆని చంద్రబాబు తెలిపారు. పారిశ్రామిక రంగం వృద్ధి రేటు రాష్ట్రంలో 9.98 శాతం ఉండగా జాతీయ స్థాయిలో 5.06 గా ఉందని, సేవారంగంలో రాష్ట్రం 9.57 శాతం వృద్ధి సాధిస్తే జాతీయ వృద్ధి 9.20 శాతంగా లెక్క తేలిందన్నారు. ఆక్వా రంగంలో ఏ.పీ తిరుగులేని వృద్ధిని నమోదు చేసిందన్నారు. ఈ రంగంలో 55.14 శాతం వృద్ధి సాధించామన్నారు. జాతీయ వృద్ధి కన్నా ఇది చాలా రెటు ఎక్కువన్నారు. ఆయితే సేవారంగం, పట్టణ జనాభా ఇంకా పెరగాల్సి ఉందని తెలిపారు.
వృద్ధి రేటులో గత ఏడాది దేశంలోనే ప్రధమ స్థానంలో ఉన్నామని, ఈ ఏడాది తొలి ఆర్ధభాగంలో రాష్ట్రమే నెంబర్ వన్ గా నిలిచిందని సీఎం వ్యాఖ్యానించారు. 2022 నాటికి మూడు అగ్ర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ను ఒకటిగా నిలపాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read