దేశంలోని అన్ని పార్టీల ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. లేఖతో పాటు విభజన చట్టం అమలుకు సంబంధించిన బుక్‌లెట్‌ను పంపారు. 2014 ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ఏపీని భాజపా మోసం చేసిందన్న ఆయన.. తిరుపతి, నెల్లూరు సభల్లో హోదాపై ప్రధాని అభ్యర్థిగా మోదీ ఇచ్చిన హామీ నెరవేర్చలేదని సీఎం లేఖలో పేర్కొన్నారు. ప్రత్యేక హోదాతో పాటు 18 అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయని.. విభజన హక్కుల సాధన కోసమే అవిశ్వాసం నోటీసు ఇచ్చామన్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించేందుకే అవిశ్వాసం నోటీసులిచ్చామని.. అవిశ్వాసానికి అందరూ మద్దతు తెలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖలో కోరారు. లేఖతో పాటు, వారి వారి భాషల్లో అర్ధమయ్యేలా, రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై పుస్తకాలు కూడా ఇచ్చారు.

letter 19072018 2

ఇవి లేఖలోని అంశాలు... ఏపీ పునర్నిర్మాణం కోసం చేసిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టు, రెవెన్యూ లోటు, రాజధానిగా అమరావతి నిర్మాణం, కొత్త రైల్వే జోన్‌, కడప స్టీల్‌ ప్లాంట్‌, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, విద్యాసంస్థల ఏర్పాటు, దుగ్గరాజపట్నం పోర్ట్‌‌, పన్ను ప్రోత్సాహకాలు, హైదరాబాద్‌ నుంచి కొత్త రాజధానికి రైలు, రోడ్డు నిర్మాణాలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్ల పెంపు, రాష్ట్ర విభజన నాటి పెండింగ్‌ సమస్యలు.. ఇలా 18 అంశాలతో పొందుపర్చిన హామీలను అమలు చేయడంలో ఎలాంటి పురోగతి లేదు. అంతేగాక.. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా.. పునర్నిర్మాణ చట్టంలోని షెడ్యూల్‌-13 ప్రకారం.. 8 మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఆరు ఇంకా ప్రారంభ స్థాయిలో కూడా లేవు.

letter 19072018 3

వీటితో పాటు.. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధానమంత్రి రాజ్యసభ వేదికగా ఏపీకి ఇచ్చిన ఆరు హామీలకు అన్ని రాజకీయ పార్టీలు సాక్ష్యంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి ప్రధాని హామీ ఇచ్చారు. ఆ సమయంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న భాజపా దీనికి అంగీకరించలేదు. ఏపీకి 10ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. ఆ తర్వాత కూడా హోదా ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే ఈ హామీలు ఈ రోజు వరకు నెరవేర్చలేదు. ఎన్నికల ప్రచారం సమయంలో తిరుపతి, నెల్లూరు సభల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన హోదా హామీని కూడా నెరవేర్చలేదు. ఈ కారణాల వల్లే తెదేపా.. కేంద్రంపై అవిశ్వాసం తీసుకొచ్చింది. గత సెషన్‌లోనే అవిశ్వాసం తీసుకొచ్చినప్పటికీ అది చర్చకు రాలేదు. ఈసారి చర్చకు వచ్చింది. శుక్రవారం జరిగే అవిశ్వాస చర్చలో అన్ని పార్టీలు తెదేపాకు మద్దతివ్వాలని కోరుతున్నా..

Advertisements

Advertisements

Latest Articles

Most Read