వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఇప్పటికే పవన్, జగన, బీజేపీతో కుమ్మక్కు రాజకీయం చేస్తున్నారని, అందరూ నమ్ముతున్నారు. అమిత్ షా ఏది చెప్తే అది వీరిద్దరూ చేస్తున్నారని, ఢిల్లీ స్క్రిప్ట్ ప్రకారం వీరు నడుస్తున్నారని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. జగన్ తన కేసుల కోసం, పవన్ కళ్యాణ్ కొన్ని వ్యక్తిగత కారణాలతో అమిత్ షాకి లొంగిపోయారు, ఢిల్లీ పై పోరాటం చేస్తున్న చంద్రబాబుని బలహీనపరిచే కార్యక్రమం చేస్తున్నారు. నాలుగు నెలల నుంచి, రాష్ట్రం అంతా, మోడీ చేసిన మోసం పై రగిలిపోతుంటే, అందరూ కలిసి ఉద్యమిస్తుంటే, జగన, పవన్ మాత్రం, కలుగుల్లో దాక్కున్నారు. మోడీ అనే పేరు ఎత్తే ధైర్యం చెయ్యకుండా, మోడీ పై పోరాటం చేస్తున్న చంద్రబాబుని టార్గెట్ చేసారు.
అయితే ఇప్పుడు ఈ అపవాదు చేరుపుకునే అవకాశం ఇద్దరికీ వచ్చింది. మోదీ సర్కారు నాలుగేళ్ల పాలన తర్వాత తొలి అవిశ్వాస పరీక్షను ఎదుర్కొంటోంది. నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా, ఇతర హామీలను నెరవేర్చడంలో విఫలమైనందుకు మోదీ ప్రభుత్వంపై టీడీపీ గత బడ్జెట్ సమావేశాల్లోనే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో మరోసారి నోటీసు ఇచ్చింది. స్పీకర్ సుమిత్రా మహాజన్ సోమవారం సభ ప్రారంభమైన రోజే అవిశ్వాస తీర్మానాన్ని అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చర్చ జరుగుతుందని చెప్పారు. అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, దేశంలో అన్ని పార్టీలకు మనకు జరిగిన ద్రోహం చెప్పి, మనకు మద్దతు ఇవ్వమని కోరింది. ఇప్పుడు జగన, పవన్ కూడా, మోడీకి వ్యతిరేకంగా, అవిశ్వాసం పై స్పందించే టైం వచ్చింది.
ఇంకా ఒక్క రోజే మిగిలి ఉంది. ఇప్పటికే వైసీపీ ఎంపీలు పార్లమెంట్ దగ్గర డ్రామాలు ఆడుతున్నారు. సభ లోపల పోరాడకుండా, రాజీనామా చేసి సభ బయట హడావిడి చేస్తున్నారు. దీని వల్ల ఏమి ఉపయోగం ఉండదు. వీరు కూడా అన్ని పార్టీలను ఢిల్లీలో కలవాలి. మోడీ పై వ్యతిరేకంగా ఓటు వెయ్యమని చెప్పాలి. మోడీ చేసిన మోసాన్ని అన్ని పార్టీలకు చెప్పాలి. అలాగే పవన్ కళ్యాణ్ కూడా, అప్పట్లో నేను ఢిల్లీలో కూర్చుని అందరి మద్దతు కూడగడతా అన్నారు. ఇప్పుడు పవన్ కూడా, మోడీ పై విశ్వాసం లేదు, వ్యతిరేకంగా ఓటు వెయ్యండి అని, అన్ని పార్టీలను కోరాలి. అవసరం అయితే చంద్రబాబు పై కూడా అందరికీ చెప్పుకోండి, కాని మోడీకి వ్యతిరేకంగా ఓటు వెయ్యమని చెప్పండి. జగన్, పవన్, ఇంతకంటే మంచి అవకాశం రాదు.ఈ పని చెయ్యండి. ఆంధ్ర రాష్ట్రం మీకు అండగా ఉంటుంది. మరి మీ ఇద్దరికీ ఆ దమ్ము ఉందా ? ఊరికే వచ్చి, ఇక్కడ హడావిడి చెయ్యటమేనా ?