మోదీని వదలొద్దు.. అతను మాటాడిన మీటింగ్స్ నీ గుర్తు చేస్తా చెప్పండి.. మహా ఐతే సస్పెండ్ చేస్తారు ..అంతకు మించి ఏమీ చెయ్యలేరు.. ఒకరు సస్పెండ్ ఐతే .. ఇంకొకళ్లు కంటిన్యూ చెయ్యండి.. అంతేగానీ .. అతన్ని మాత్రమ్ వదలొద్దు.. ఇది చంద్రబాబు ఎంపీలకు ఈ రోజు చివరి సారిగా చెప్పిన విషయం. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించిన ప్రధాని మోదీ గత నాలుగేళ్లలో దాన్ని ఎందుకు సరిదిద్దలేకపోయారో సమాధానం చెప్పాలంటూ నిలదీయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెదేపా ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 7న మోదీ లోక్‌సభలో మాట్లాడుతూ... పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్ర పునర్విభజన బిల్లును ఆమోదించి కాంగ్రెస్ ఏపీకి అన్యాయం చేసిందని చెప్పారనిప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో ఇదే అంశాన్ని గట్టిగా ప్రస్తావించాలని సూచించారు.
‘‘అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ముందే అన్ని పార్టీల నేతలను కలిసి మద్దతు కోరడం మంచిదైంది. ఆయా పార్టీలు మనకు అండగా నిలిచాయి. చర్చ సందర్భం గానూ వారి మద్దతు మనకే లభించేలా చూడాలి. పద్నాలుగేళ్ల తర్వాత కేంద్రం ఎదుర్కొంటున్న అవిశ్వాసం ఇది. ఇది మన రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించింది. అందుకే అన్ని అంశాలపై పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలి. చర్చకు మొత్తం పదిగంటల సమయం ఇచ్చే అవకాశముంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తొలి అవకాశం తెదేపాకే వస్తుంది. చర్చపై ప్రధానమంత్రి సమాధానం ఇచ్చిన తర్వాత కూడా మళ్లీ అవకాశం ఉంటుంది. సమయం చాలకపోతే ప్రసంగం లిఖిత ప్రతిని అందజేయాలి"
"లోక్‌సభ రికార్డుల్లో నమోదు చేయమని కోరాలి. పార్టీ ఎంపీలంతా సమర్థ పాత్ర పోషించాలి. తెదేపాకు కేటాయించే సమయాన్ని బట్టి ఎంతమంది మాట్లాడేదీ ముందే నిర్ణయించుకొని అందుకు తగ్గట్టు బలమైన గొంతు వినిపించాలి. మాట్లాడానికి అవసరమైన అంశాలపై పార్టీపరంగా, ప్రభుత్వపరంగా సమాచారం అందుబాటులో ఉంచుతాం’’ అని చంద్రబాబు అన్నారు. లోక్‌సభ సభాపతి, రాజ్యసభ ఛైర్మన్‌లు నిర్వహించిన అఖిల పక్ష సమావేశాల చర్చల సారాంశాన్ని ఎంపీలు చంద్రబాబుకు వివరించగా... మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో భేటీ వివరాలను సీఎం ఎంపీలకు చెప్పారు. ఉండవల్లి అందజేసిన పుస్తకాలు, నివేదికలు, న్యాయస్థానాల కేసుల్లోని అంశాలను అధ్యయనం చేయాలని సూచించారు.