అందరికీ శకునం చెప్పే బల్లి, కుడితలో పడింది అనే సామెత గుర్తుందా ? ఆంధ్రప్రదేశ్ లో నా అంత ఉత్తముడు లేడు అంటూ, చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కూడా సంకించే పవన్ కళ్యాణ్ కు, ఎదురైన సంఘటన చుస్తే ఇదే గుర్తుకు వస్తుంది. చెప్పేందుకే నీతులు ఉంటాయి, ఆచరించటానికి కాదు అని పవన్ ను చూస్తే అర్ధమవుతుంది. "అన్నా మేము బళ్ళు సైలేన్స్ ర్ తీసి సౌండ్ చేసుకుంటూ తోలతంటే, పోలీసులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్నా" అని పవన్ అభిమానులు చెప్తే, దానికి పవన్ ఇచ్చిన రియాక్షన్ అదేమన్నా పెద్ద తప్పా ? మీరు తప్పులు చెయ్యటం లేదా అని. పవన్ ఎలాంటి వాడో ఇక్కడే అర్ధమవుతుంది. అయితే, అందరూ ఒకేలా ఉండరు కదా. ఎక్కడో ఒక చోట మనకు సరైన వాడు దొరుకుతాడు. అలాంటి అనుభవమే పవన్ కు ఎదురైంది.
రెండు రోజుల క్రితం భీమవరంలో అభిమానులతో పవన్కళ్యాణ్ సమావేశమయ్యారు. నేను ఇది చేస్తాను, అది చేస్తాను అని పవన్ ప్రసంగం చేస్తుంటే, పవన్ అభిమానులు కేకలు ఈలలు. ఇలా జరుగుతూ ఉండగా, ఓ డాక్టర్ లేచి మైకు అందుకున్నారు. ఆ డాక్టర్ పేరు సోమరాజు. ఆయన గురించి పవన్ కు పూర్తిగా తెలియదు ఏమో కాని, అక్కడ ఉన్న లోకల్ వాళ్ళకి తెలుసు. ఈయన మైక్ అందుకోవటంతోనే, ఇక పవన్ పని అయిపొయింది అనుకున్నారు అక్కడి వారు. ఇక పవన్ ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, మా మెయిన్ ప్రాబ్లం లీడర్స్ అండి, ఎలాగో చెబుతాను, అంటూనే ఎప్పుడైతే లీడర్ తప్పు చేశాడో సొసైటీలో అదే అంగీకారరమైపోతోంది. ఆయన చేస్తే తప్పులేదూ నేను చేస్తే ఏంటీ అంటున్నారు అంటూ ఆయన చురక అంటించారు.
దీంతో పవన్ బిత్తరపోయాడు. బయటకు కనిపించకుండా ఒక వెర్రి నవ్వు నవ్వాడు. కొంపదీసి జగన్ లాగా వ్యక్తిగత జీవితం గురించి అడుగాతారేమో అని కంగారు పడ్డాడు. కానీ ఆ డాక్టర్ అంతటితో వదిలేయలేదు సింపుల్గా నేను ఒక్కటే అడుగుతాను నేను తప్పు చేయలేదు, తప్పు చేసేవాడిని సిగ్గుపడేలా చేస్తాను అంటూ ఒక మాట మాట్లాడండి అందరం ఓట్లు వేసి వెళ్లిపోతాం అన్నారు. యధారాజా తథా ప్రజా అన్నట్లుంది ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి అంటూ దులిపేశారు. దీంతో పవన్ కు ఒక్క నిమిషం అర్ధం కాలేదు. వెర్రి నవ్వులు నవ్వుతూ ఉండిపోయాడు. కాలికి దెబ్బ తగిలితే చేతి బ్యాండేజీ వేసుకున్నారేంటి, కాలిది వేసుకోండి అంటూ ఒక డాక్టర్ గా పవన్ కు సలహా ఇచ్చారు. దీంతో పవన్ మరో వెర్రి నవ్వు నవ్వాల్సి వచ్చింది. మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మీరు చూడండి… https://youtu.be/QkG70s30zyw