నిన్న జగన్ కాపు రిజర్యేషన్లు సాధ్యంకాదని చేసిన వ్యాఖ్యల పై ముద్రగడ స్పందించారు. ఆయన ఆదివారం ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ కాపు జాతి ఓట్లు అడిగే అర్హత జగన్‌కు లేదని, వైసీపీ తరఫున కాపు జాతికి టికెట్లు కూడా ఇవ్వొద్దని అన్నారు. ఒకో నియోజక వర్గంలో కాపు జాతి సోదరులను ముగ్గురిని ఎగదోస్తూ... వాళ్ళతో లక్షల రూపాయలు ఖర్చు చేయిస్తున్నారని ముద్రగడ మండిపడ్డారు. రెట్టింపు నిధులిస్తానంటూ మాపై సవతి తల్లి ప్రేమ చూపొద్దని, జగన్ కాపు జాతిని ఈ విధంగా కించపరచడం చాలా పెద్ద తప్పుని ముద్రగడ వ్యాఖ్యానించారు. జగన్‌కి తాను రేడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించాలని జగన్ తన అనుచరులతో కబురు పంపారని, కాపు జాతికి జగన్ ఏంచేసాడని స్వాగతం పలకాలని అడిగానని, ఆ ఉక్రోషంతోనే జగన్ కాపు జాతిని అవమానించారని ఆయన అన్నారు.

mudragada 29072018 2

తన కుటుంబంపై నిన్న జగన్ దొంగ ప్రేమ, మొసలి కన్నీరు కార్చారని, తాను అవమాన పడిన రోజు ఆయన ఏమయ్యారని ముద్రగడ ప్రశ్నించారు. జగన్ దొంగ ప్రేమ తనకక్కర్లేదన్నారు. తన జాతి ప్రయోజనాలే తనకు ముఖ్యమని అన్నారు. ‘అవి మీ పరిధి కాదన్న మీ పల్లకీ మొయ్యం. మా జాతికి రిజర్యేషన్ ఇచ్చేవాళ్ళ పల్లకీనే మోస్తాం’అని ముద్రగడ స్పష్టం చేశారు. జగన్ ముఖ్యమంత్రి పదవీ కాంక్ష వదిలేస్తే మా జాతి రిజర్వేషన్ల ఆకాంక్ష వదులుకుంటామని ఆయన అన్నారు. జగన్ తన పాదయాత్రకు ప్రజలను తరలించడానికీ, ప్లెక్సీలు కట్టడానికి కాపు జాతి సోదరులు ఆస్తులు ఆర్పుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ వల్ల కాపు రాజకీయనేతల జీవితాలు, కుటుంబాలు నాశనమయిపోతున్నాయన్నారు.

mudragada 29072018 3

పవన్ కల్యాణ్‌పై జగన్ చేసిన కామెంట్స్ చాలా తప్పని అన్నారు. రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను లాగడం దారుణమన్నారు. కాపు ఉద్యమాల గడ్డ అయిన తూర్పుగోదావరి జిల్లాలోనే జగన్ కాపులను అవమానించాడని, పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేశాడని ముద్రగడ చెప్పారు. ‘‘జగన్ అపర మేధావి. కాపు జాతి ఏమీ చేయలేదనే మిగిన జాతుల ఓట్ల కోసం ఆయన ఈ స్టెప్ తీసుకున్నాడు. ఈ జిల్లా నుంచే పవన్‌ని వ్యక్తిగతంగా అవమానించాడు. రిజర్వేషన్లు సాధ్యం కాదంటూ కాపుజాతి ఆశలపై నీళ్ళు చల్లాడు.’’ అని ముద్రగడ విమర్శించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read