ఇమ్రాన్ ఖాన్.. క్రికెట్‌ చరిత్రలో నిలిచిపోయే పేరు... పాకిస్తాన్‌ క్రికెట్‌ లో ఫాస్ట్ బౌలర్ గా ఒక ఊపు ఊపేసాడు.. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తరువాత రాజకీయాల్లోకి వచ్చారు... వ్యక్తిగత జీవితం అంతా వివాదాలే.. అయినా సరే, ఇప్పుడు అక్కడ ప్రజలు ఆదరించటంతో ప్రధాని అయ్యారు. ఆ దేశంలో జరిగిన ఎన్నికల్లో, అన్ని పార్టీల కన్నా, 'పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఎ ఇన్సాఫ్‌' 'పీటీఐ' ముందంజలో ఉంది. 272 స్థానాలకు నేరుగా జరిగిన ఎన్నికల్లో 'ఇమ్రాన్‌' పార్టీ 103 సీట్లు గెలుచుకుని, పాక్‌ జాతీయ అసెంబ్లీలో అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఇమ్రాన్ ఖాన్ గెలుపు చూసి, పవన్ ఫాన్స్ సంబరి పడిపోతున్నారు. దానికి కారణాలు కూడా చెప్తున్నారు.

imran 27072018 2

ఇమ్రాన్ ఖాన్ క్రికెట్ నుంచి వచ్చి ప్రధాని అయ్యాడు, మా పవన్ సినిమాల నుంచి వచ్చి సియం అవుతాడు అని చెప్పుకుంటున్నాడు. ఇమ్రాన్ ఖాన్ 22 ఏళ్ళు కష్టపడితే ఒక దేశానికి అధ్యక్షడు అయ్యాడని, మా పవన్ ఇప్పటికే 10 ఏళ్ళు రాజకీయంలో ఉన్నాడు కాబట్టి, వచ్చే ఎన్నికల్లో సియం అయిపోతాడు అని చెప్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ వ్యక్తిగత జీవితం కూడా పవన్ వ్యక్తిగత జీవితంలోని వివాదాలకి దగ్గరగా ఉంటుంది అని, అయినా అక్కడ ప్రజలు ఆదరించారు అంటే, వ్యక్తిగత జీవితం రాజకీయాల్లో పని చెయ్యదని, మరోసారి రుజువైందని చెప్తున్నారు, పవన్ ఫాన్స్. ఇమ్రాన్ ఖాన్ కు అక్కడ సైన్యంతో పాటు ఉగ్రవాదుల సపోర్ట్ ఉందని, ఇక్కడ కూడా పవన్ కు బీజేపీ సపోర్ట్ ఉందని చెప్తున్నారు.

imran 27072018 3

పవన్ ఫాన్స్ మాత్రమే కాదు, ఏకంగా పవన్ కూడా ఈ విషయం పై నిన్న స్పందించారు. ఇరవై రెండేళ్ల క్రితం పాకిస్థాన్‌లో పార్టీ ఏర్పాటు చేసిన ఇమ్రాన్‌ఖాన్‌ ఓపిక ఇప్పటికి ఫలించిందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఒక్క రాత్రిలో మార్పు రాదన్నారు. ఎవరికైనా ఆశయం, సహనం ఉండాలన్నారు. అందుకే తాను మరో ఇరవై అయిదేళ్లు రాజకీయాల్లోనే ఉంటానని, ఇమ్రాన్ ఖాన్ దీనికి ఒక ఉదాహరణ అని అన్నారు. ఇవన్నీ బాగానే ఉన్నా, పవన్ తో పాటు అతని ఫ్యాన్స్ ఆలోచించాల్సింది, ఇది పాకిస్తాన్ కాదు, ఆంద్రప్రదేశ్... అక్కడ ఇమ్రాన్ ఖాన్ కంటే గొప్ప వాళ్ళు అక్కడ ప్రజలకు కనిపించలేదేమో, ఇక్కడ నిరంతర ప్రజా సేవకుడు చంద్రబాబు ఉన్నాడు. నిజంగా పవన్ కు అంత ఓర్పు ఉంటే, ప్రజలు కచ్చితంగా ఆదరిస్తారు. 2009 రాజకీయాల్లో ఉన్నాను అని చెప్పుకునే పవన్, ప్రతి సారి ఎన్నికల ముందు వచ్చి వెళ్లిపోతుంటే, ప్రజలు ఏమన్నా తెలివి లేని వాళ్ళా ? అయినా, మనం ఎవరి సంతోషం, అభిప్రాయాలను కాదనలేం కదా, కాలమే వీరికి సమాధానం చెప్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read