దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా అందుకు సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఓటువేయగానే రసీదు వచ్చే వీవీపాట్‌ (ఓటర్‌ వెరిఫైయబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌) యంత్రాలను 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందే అందుబాటులో ఉంచుతామని భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రీపోల్‌ సన్నాహకాలకు ముందే అన్ని ప్రాంతాలకు అవసరమైనన్ని వీవీపాట్‌లను యంత్రాలు ఎన్నికల కమిషన్‌కు చేరతాయని పేర్కొంది. ఎన్నికల గడువు సమీపిస్తున్న వీవీపాట్‌ యంత్రాలను సకాలంలో అందుతాయో లేదోనన్న మీమాంశలో ఈసీ ఉందన్న వార్తల నేపథ్యంలో స్పందించిన ఎన్నికల కమిషన్‌… 2019 లోక్‌సభ ఎన్నికలకు దేశంలోని అన్ని పోలింగ్‌ స్టేషన్‌లకు వీవీపాట్‌ యాంత్రాలను చేరవేస్తామని స్పష్టం చేసింది.

ec 26072018 2

ఎన్నికలకు 16.15 లక్షల వీవీపాట్‌ యంత్రాలు అవసరమౌతాయని గుర్తించిన ఎన్నికల సంఘం మిషన్ల చేరవేత అంశాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని పేర్కొంది. 2019 సాధారణ ఎన్నికల్లో వీవీపాట్‌ యంత్రాలను అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతామని భారత ఎన్నికల సంఘం గతేడాది సుప్రీంకోర్టుకు హామీపత్రాన్ని సమర్పించింది. వీవీపాట్‌ యంత్రాలను తయారు చేసేపనిని ప్రభుత్వ రంగ సంస్థలైన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌), ఎలక్ట్రానిక్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌)కు ఈసీ గతేడాది అప్పగించింది. 2018 సెప్టెంబర్‌ నాటికి యంత్రాలను అప్పగించాలని డెడ్‌లైన్‌ విధించింది.

ec 26072018 3

ఆర్డర్‌ ఇచ్చిన 14 నెలలకు 22 శాతం వీవీపాట్‌ యంత్రాలను ఈసీ చేరడంతో అనుకున్న సమయానికి ఎన్నికల కమిషన్‌ తమహామీని నిలబెట్టుకుంటుందా అన్నకోణంలో పలు వార్త కథనాలు వచ్చాయి. మొత్తం 16.15 లక్షల వీవీపాట్‌ యంత్రాలకుగానూ ఈ ఏడాది జూన్‌ నాటికి కేవలం 3.48 లక్షల యంత్రాలను మాత్రమే తయారీ కంపెనీలు అందించినట్లు తమ కథనాల్లో ఉటం కించాయి. దీంతో వీవీపాట్‌ యంత్రాల విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. అనుకున్న సమయానికి అన్ని పోలింగ్‌ కేంద్రాలకు ఓటు వేయగానే రసీదు వచ్చే యంత్రాలు చేరుకుంటాయని ఎన్నికల కమిషన్‌ వివరణ ఇచ్చింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read