కేంద్రం చేస్తున్న వివక్షను దాటుకుని, నెమ్మదిగా ఎదుగుతుంది ఆంధ్రప్రదేశ్. ఉన్న వనరులతో, చంద్రబాబు నాయకత్వంలో ముందడుగు వేస్తుంది. ఇందులో ముఖ్యంగా ఆక్వా రంగంలో, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ గా ఉంది. అయితే, ఇప్పుడు బీజేపీ కన్ను ఈ రంగం పై పడింది. మనలను ఇబ్బంది పెట్టటానికి, మన నుంచి ఉత్పత్తి అయ్యే చేపలను నిషేదిస్తూ కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్రంలో పండే చేపల్లో ఫార్మాలిన్ ఉంటుంది అనే సాకు చూపించి, బిజెపి పాలిత రాష్ట్రాలు మన రాష్ట్రం నుండి కొనుగోళ్ళు ఆపేశాయి. దీంతో ఇది ఒక పెద్దగా అధికారులు భావిస్తున్నారు. మన ఆదాయం పై దెబ్బ పడుతుందని, మిగతా రాష్ట్రాలు కూడా ఈ ప్రచారం నిజమే అనుకునే ప్రమాదం ఉందని, అధికారులు అంటున్నారు.
ఈ పరిణామాల పై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించారు. ఈశాన్య రాష్ట్రాల అయిన, అసోం, నాగాలాండ్, మేఘాలయ ముఖ్యమంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. చేపల నిల్వ కోసం ఫార్మాలిన్ కెమికల్ కలుపుతున్నారంటూ కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఏపీలో చేపల నాణ్యతను పరిశీలించి ఫిష్ క్వాలిటీ టెస్ట్ సర్టిఫికెట్ ఇస్తామన్నారు. అసోంలో ఏపీ నుంచి వచ్చిన చేపలను అధికారుల సమక్షంలో పరీక్షించగా కేన్సర్ కారకమైన ఫార్మాలిన్ లేదని తేలిందని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. మీరు తీసుకున్న నిర్ణయం ఒకసారి పునఃసమీక్షించుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులను కోరారు.
బిజెపి పాలిత రాష్ట్రాలకు తప్ప ఈ ఫార్మాలిన్ మరే రాష్ట్రానికి కనపడలేదు. బీహార్, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాలు ఎప్పటిలాగే కొనుగోలు చేస్తున్నాయి. అంతే కాదు మన రాష్ట్రం నుండి ఎగుమతి అవుతున్న సౌత్ ఆసియన్ కంట్రీస్, కొత్తగా కొంటున్న కొరియా , యూరోపియన్ కంట్రీస్, జపాన్.... వీటిలో ఏ దేశానికి కూడా ఈ ఫార్మాలిన్ కనపడలేదు. కేవలం బిజెపి పాలిత రాష్ట్రాలకే కనపడింది. ఇది కేవలం చంద్రబాబు మీద కోపంతో, తమ పార్టీని ఎదిరించాడని , అందుకే ఆంద్రప్రదేశ్ ని ఆర్ధికంగా దెబ్బతీయాలని చూస్తున్న కమలనాధుల నాటకం, రాజకీయ విభేదాలున్నా, సైద్దాంతిక వైరుధ్యాలున్నా ఎప్పుడు , ఏ పార్టీ ఇలా ప్రవర్తించింది లేదు. ఇంత దారుణంగా, బహిరంగంగా, నిర్లజ్జగా అధికార దుర్వినియోగం చేస్తున్న పార్టీ బిజెపినే. ముఖ్యమంత్రి వివరణతో అయినా, వారు నిర్ణయం మార్చుకుంటారేమో చూస్తున్నాం.