చంద్రబాబు అనే వాడిని ఎలా అయినా దించాలి.. ఇప్పుడు అందరి ముందు ఉన్న టార్గెట్ అదే... ఢిల్లీ పెద్దలు ఆదేశాలు మేరకు, ఇక్కడ కొంత మంది చేస్తున్న వెకిలి వేషాలు చూస్తూనే ఉన్నాం.. ఈ వెకిలి వేషాలకు తోడుగా, ఢిల్లీ స్థాయిలో అధికార బలంతో, వ్యవస్థలని తమ ఆధీనంలోకి తీసుకుని, తద్వారా చంద్రబాబుకు ఇబ్బంది కలిగిస్తుంది కేంద్రం. తాజాగా మరో ప్లాన్ తో ముందుకొచ్చింది.. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పరిస్థితి చూసి అక్కడ ఎమ్మల్యే బొండా ఉమా అవాక్కయ్యారు. తన నియోజకవర్గంలో ఉన్న ఓటర్ లిస్టు చూసి అవాక్కయ్యారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 2014లో రెండు లక్షల 65వేలకుపైగా ఉన్న ఓటర్ల సంఖ్య ఇప్పటికి లక్షా 70వేలకు పడిపోయింది. అంటే 95వేల ఓటర్లను అధికారులు తొలగించారు.
దీంతో అసలు ఏమి జరిగిందో అర్ధం కాక, వెంటనే ఎన్నికల సంఘం అధికారులను వివరణ కోరగా, వారి వాదన మరో రకంగా ఉంది. ఓటరు కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేశారు. అయితే కొందరు ఆధార్ లేకపోవడంతో ఓటు కోల్పోయారు.. అలాగే ఆధార్‌లో పేరు ఉన్నా. ఓటరు కార్డులో ఉన్న పేరుతో సరిపోకపోవడం అంటే స్పెల్లింగ్ పొరపాట్లు వంటి కారణంగా మరికొందరు ఓట్లు కోల్పోయారు. అయితే ఆధార్‌కు-ఓటరు కార్డుకు సంబంధం లేదని సుప్రీం చెప్పినా... ఆ ఆదేశాలకు అనుగుణంగా తొలగించిన వారి పేర్లను తిరిగి చేర్చలేదు. దీంతో వెంటనే బొండా ఉమా ఈ విషయం పై చంద్రబాబుకు ఫిర్యాదు చేసారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 70వేల ఓట్లు, పెనమలూరు నియోజకవర్గంలో 40 వేల ఓట్లను ఎన్నికల సంఘం అధికారులు తొలగించారు.. ఒక్కో నియోజకవర్గంలో వేలల్లో ఓట్లు తొలగిస్తే ఇక 175 నియోజకవర్గాలను లెక్కిస్తే లక్షల్లో ఉంటుందని పార్టీలు లెక్కలేస్తున్నాయి.. ఇది వచ్చే ఎన్నికల ఫలితాలపై ప్రభావం కూడా చూపుతుందని తెలుగుదేశం నేతలు అంటున్నారు. ఓటు ఉన్నదా లేదా అనేది తెలుసుకోవాలంటే ఈసేవా, ఆన్‌లైన్, ఓటరు నమోదు కేంద్రాల వద్ద చెక్ చేసుకోవాలి ఉంటుందని, లేకపోతే తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. ఎన్నికలకు మరికొద్ది నెలలే సమయం ఉన్న తరుణంలో పెద్ద ఎత్తున ఓట్లు మాయం కావడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక్కో నియోజకవర్గంలో 50వేలు నుంచి లక్ష వరకు ఓట్లు మాయం కావడం సంచలనం సృష్టిస్తోంది.