మన రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడికి, వారంలో 6 రోజులు ఒకెత్తు, శుక్రవారం ఒకెత్తు... ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, శుక్రవారం మాత్రం జగన్, నాంపల్లి కోర్ట్ కు రావాల్సిందే... ఎన్ని పనుల్లో ఉన్నా రావాల్సిందే... పోయిన శుక్రవారం చూసాం, రాష్ట్రంలో 5 కోట్ల మంది, అవిశ్వాస తీర్మానం చూస్తూ, మన రాష్ట్ర సమస్యల పై, మోడీ ఏమన్నా స్పందిస్తారేమో అని, టీవీలు చూస్తూ కూర్చుంటే, మనోడు నాంపల్లి కోర్ట్ లో ఉన్నాడు. చివరకు ఒక ట్వీట్ పెట్టి, రేపు ఉదయం 8:30 కి స్పందిస్తా అని చెప్పారు అంటే, శుక్రవారానికి, జగన్ కు ఉన్న సంబంధం అది. మరి, అసలు ప్రతి శుక్రవారం జగన్ కోర్ట్ లో ఏమి చేస్తాడు ? జడ్జి ఏమి ప్రశ్నలు వేస్తారు ? జగన్ చేసిన లూటీ గురించి ఎలా సమర్ధించుకుంటాడు ? ఇవన్నీ ప్రజలు తెలుసుకోవాలని ఉంటుంది. కాని, లోపల ఏమి జరుగుతుందో తెలుసుకోవటం కష్టం. అయితే ఇప్పుడు కేంద్రం, సుప్రీం కోర్ట్ తీసుకున్న నిర్ణయంతో, అన్ని కేసుల విచారణ లైవ్ చూడవచ్చు.
కోర్టుల్లో జరిగే వ్యవహారాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా బయటి ప్రపంచానికి తెలియజేయాలనే ప్రతిపాదనకు కేంద్రం మద్దతు తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు నివేదించింది. ఈ లైవ్ స్ట్రీమింగ్ ప్రక్రియ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కోర్టు నుంచే ప్రారంభం కావాలని పేర్కొంది. ప్రత్యక్ష ప్రసారం ఆలోచనకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందని.. అయితే ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. ‘పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టాలి. అది కూడా సీజేఐ కోర్టు నుంచే ప్రారంభించాలి’ అని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనానికి అటార్నీ జనరల్ వెల్లడించారు.
‘రాజ్యాంగ ధర్మాసనాలకు సంబంధించిన వ్యవహారాలు న్యాయవాదులు, న్యాయవిద్యార్థులు, ఇతరులకు ఆసక్తికరంగా ఉంటాయి. కాబట్టి వీటిని కూడా ప్రత్యక్ష ప్రసారం చేయండి. కోర్టు ప్రాంగణాల్లో తెరలు ఏర్పాటు చేసి వీటిని ప్రదర్శించాలి. కోర్టుతో సంబంధం లేకుండా చూసే వీలును కల్పించాలి’ అని ఏజీ వెల్లడించారు. అయితే ఈ వీడియో క్లిప్లు దుర్వినియోగం కాకుండా చూడాలని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ న్యాయస్థానాన్ని కోరారు. సోషల్ మీడియాకు ఈ వీడియోలు చేరితే వీటిని నియంత్రించడం కష్టసాధ్యమని న్యాయవాది విరాగ్ గుప్తా అన్నారు. ఇవన్నీ క్రోడీకరించి, ఒక నిర్ణయానికి రానున్నారు. అప్పుడు జగన్ తో పాటు, అందరి విచారణ లైవ్ లో చూడవచ్చు...