అయ్యా జగన్మోహన్ రెడ్డిగారు ఇన్నిరోజులు ప్రత్యేక హోదా పేరుతో కాకమ్మ కబుర్లు చెప్పి కాలం వెల్లబుచ్చారు.... నిన్న పార్లమెంటులో తెలుగుదేశం ఎంపిల పోరాటం చూసాక గుండెల్లో దడపుట్టి ప్రజలు మీ పార్టీని మరిచిపోతారేమో అనే భయంతో బంద్ కి పిలుపునిచ్చారు... దీని వల్ల ప్రత్యేకహోదా వస్తదా..? కనీసం బడి పిల్లలైనా మీ బంద్ కి సహకరిస్తారా..? ఈ బంద్ వల్ల పావలా ఉపయోగమైనా ఉందా...? ఉపయోగం లేకపోగా..ఆర్టీసి లాంటి ప్రభుత్వ సంస్థలకు ఒక పూట ఆదయం బొక్క.. చిరు వ్యాపరులు ఒకరోజు తమ వ్యాపారాన్ని వదిలి ఇంట్లో కుర్చోవాల్సిన పరిస్థితి..
ప్రజలు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి.. రవాణా కు అంతరాయం... ఈ బంద్ వల్ల రాష్ట్రానికి అన్నీ నష్టాలే.. అసలు ఈ బంద్ జరుగుతుందని, పక్క రాష్ట్రం వాడికే తెలియదు, ఇంకా ఢిల్లీలో మోడీకి ఏమి తెలుస్తుంది.. అసలే రాష్ట్రం నిధుల్లేక అల్లాడుతుంటే... పనికిరాని బంద్ లకు పిలుపునిచ్చి వచ్చే ఆదాయానికి గండి కొట్టాలని చూస్తున్నావు.. మీ చర్యలను ప్రజలు గమనిస్తునే ఉన్నారు... ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది మోడీ.. అందుకే ఢిల్లీలో కడిగిపడేస్తున్నాడు చంద్రబాబు.. నువ్వు నీ ఎంపీల చేత రాజీనామా చేయించి బయట తిప్పుతున్నావు... రాజ్యసభలో ఉన్న విజయసాయి రెడ్డి, ఏమి చేస్తున్నాడో అందరూ చూస్తున్నారు...
మీరు ఇలా ఎంజాయ్ చేస్తుంటే, మీ స్వార్ధ రాజకీయాల కోసం, ప్రజలు బలి అవ్వాలా ? ఒక సమస్య పై, ఒకసారి బంద్ చేస్తారు.. కాని నెలకు ఒకసారి ఏంటిది ? అదీ ఢిల్లీ స్థాయిలో తేల్చుకునే విషయం, మన రాష్ట్రంలో నీ వీరత్వం చుపించటమేంటి ? ఒక్క రెండు రోజులు పాదయాత్ర వాయిదా వేసి, పార్లమెంట్ ముందు ధర్నా చేస్తాను, మీరు రండి అని పిలుపు ఇవ్వండి, అప్పుడు ప్రజలు సహకరిస్తారు. అంతే కాని, రాష్ట్రంలో ఉన్న ప్రజలను ఇబ్బంది పడితే, మోడీకి పోయేది ఏమి ఉంటుంది ?వారికి కావాల్సింది కూడా, రాష్ట్రం ఇలా అల్లకల్లోలంగా ఉండటమే... మనం ఎందుకు వారి ఉచ్చులో పడాలి ? నువ్వు చేసే బంద్ కు, ఒక్క పార్టీ కూడా, నీకు మద్దతు ఇవ్వలేదు అంటే, మీరు చేస్తున్న పోరాటం ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు... ఇకనైనా ఈ గల్లీ వేషాలు మాని, ఢిల్లీలో పోరాడండి, లేకపోతే మీ పాదయాత్ర చేసుకోండి...