వైఎస్సార్సీ పార్టీ నర్సాపురం లోకసభ నియోజకవర్గ సభ్యుడు రఘురామకృష్ణంరాజు వ్యవహరాన్ని ఆ పార్టీ అధిషానం సీరియస్ గానే తీసుకుంది. ఆయన పై ఎంపి సభ్యత్వానికి అనర్హత వేటు వేయాలని నిర్ణయించింది. ఆ మేరకు లోకసభ స్పీకరుకు లేఖను ఇచ్చేందుకు ఆ పార్టీ పార్లమెంటు సభ్యులు సిద్ధమయ్యారు. వారికి స్పీకరు ఓం ప్రకాశ్ బిర్లా అప్పాయింట్ మెంట్ ఇచ్చారు. ఇటీవల ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి పై, తన పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు చేసిన ఓవర్ ఆక్షన్ పై తీవ్ర విమర్శలు చేసిన రామకృష్ణంరాజుకు పార్టీ అధిష్టానం సంజాయిషీ నోటీసు ఇచ్చింది. దీనిపై కుడా స్పందించిన రాజు గారు, తాను యువజన శ్రామీక కాంగ్రెస్ నుంచి ఎంపిగా ఎన్నికయ్యాయని, తనకు వైఎస్సాఆర్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సంజాయిషీ లేఖ రాస్తే చెల్లుబాటు కదనీ, క్రమశిక్షణ సంఘం చెయ్యల్సింది, విజయసాయి రెడ్డికి ఏమి సంబంధం అని వ్యాఖ్యానించారు. తాను పార్టీకి, ముఖ్యమంత్రికి విదేయుడినంటునే సుతిమెత్తగా అంటించారు.
ఇక తన పై ఒక సామజివర్గం మనుషులు చేస్తున్న బెదిరింపులు విషయంలో, ఆయన ఎన్నికల కమిషనర్‌ను, లోక్ సభ స్పీకరును, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి తన రక్షణ కల్పించాలని కోరారు. దీంతో విసిగిపోయిన వైకాంగ్రెస్ పార్టీ రామకృష్ణరాజు పార్లమెంటు సభ్యత్వంపైనే వేటు వేయాలని నిర్ణయించింది. ఆయన పై అనర్హత వేటు వేయాలంటూ లోకసభకు స్పీకర్‌కు లేఖ అందజేయాలని పార్లమెంటు సభ్యులకు ఆదేశాలిచ్చింది. దాంతో విజయవాడనుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వైకాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు, కొందరు న్యాయవాదులు బయలుదేరి వెళ్లారు. అయితే ఈ పరిణామం చోటు చేసుకున్న సమయంలో రఘురామరాజు మరో అనూహ్యం నిర్ణయం తేసుకున్నారు. తన పై అనర్హత వేటు వేసే అధికారం వీళ్ళకు లేడని, వేరే పార్టీ లెటర్ హెడ్ పై షోకాజ్ నోటీస్ ఇచ్చారని, అనర్హత ప్రాసెస్ ని అడ్డుకోవాలని కోర్టులో పిటీషన్ వేసారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరు అని, తమ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అలాగే తాను ఎక్కడా పార్టీని కాని, నాయకుడిని కానీ, ఎక్కడా ఒక్క మాట కూడా అనలేదని, ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తేవటమే తన పాపమా అని రఘురామ రాజు అన్నారు. ఈ పార్టీ పేరు వ్యవహారం పై ఇప్పటికే ఈసీ దృష్టికి తెచ్చానని, ఆ నిర్ణయం ఏమిటో చూడాలని కోర్టుకు తెలిపారు.