రాష్ట్రాన్ని అన్ని విధాలుగా తొక్కేస్తుంది కేంద్రం.. చట్టంలో ఉన్న విభజన హామీల దగ్గర నుంచి, మనకు వచ్చే నిధులు దాకా అన్నిట్లో వివక్షే చూపిస్తుంది. తాజాగా మరో వివాదం కూడా రేగింది. మనం కష్టపడి చేసుకుంటున్న వాటి పై కూడా కక్ష సాధిస్తుంది కేంద్రం. ఆక్వా రంగంలో, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్న సంగతి తెలిసిందే. మనలను ఇబ్బంది పెట్టటానికి, మన నుంచి ఉత్పత్తి అయ్యే చేపలను నిషేదిస్తూ కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్రంలో పండే చేపల్లో ఫార్మాలిన్ ఉంటుంది అనే సాకు చూపించి, బిజెపి పాలిత రాష్ట్రాలు మన రాష్ట్రం నుండి కొనుగోళ్ళు ఆపేశాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు మనం ఎక్కువ ఎగుమతి చేసుకుంటాం.

cbn letter 29072018 2

ఈ పరిణామాల పై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించారు. ఈశాన్య రాష్ట్రాల అయిన, అసోం, నాగాలాండ్‌, మేఘాలయ ముఖ్యమంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. చేపల నిల్వ కోసం ఫార్మాలిన్ కెమికల్ కలుపుతున్నారంటూ కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఏపీలో చేపల నాణ్యతను పరిశీలించి ఫిష్‌ క్వాలిటీ టెస్ట్‌ సర్టిఫికెట్‌ ఇస్తామన్నారు. అసోంలో ఏపీ నుంచి వచ్చిన చేపలను అధికారుల సమక్షంలో పరీక్షించగా కేన్సర్ కారకమైన ఫార్మాలిన్ లేదని తేలిందని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. మీరు తీసుకున్న నిర్ణయం ఒకసారి పునఃసమీక్షించుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులను కోరారు.

cbn letter 29072018 3

చంద్రబాబు రాసిన లేఖపై స్పందించిన అసోం, మణిపూర్‌ ముఖ్యమంత్రులు.. చేపల దిగుమతిపై నిషేధం ఎత్తివేసినట్లు.. ఏపీ మత్స్యశాఖ అధికారులకు సమాచారమిచ్చాయి. చంద్రబాబు రంగంలోకి దిగటంతో, అన్నీ సర్దుకున్నాయి. ఈ విషయం పై, లేఖ రాసిన ముఖ్యమంత్రి, తరువాత స్టేజిలో ఢిల్లీ పెద్దలు, రాష్ట్రాన్ని ఎలా చేస్తున్నారో చూడండి అంటూ వివిధ రాష్ట్రాలకి లేఖలు రాయటానికి రెడీ అయ్యారు. ఇదే విషయం పై పార్లమెంట్ లో కూడా నిలదీయటానికి రెడీ అయ్యారు. దీంతో ఢిల్లీ పెద్దలు రంగలోకి దిగారు. ఇప్పటికీ చంద్రబాబు దెబ్బతో పరువు పోయిందని, ఇలాంటివి కూడా బయటకు వస్తే, ఉన్న కాస్త పరువు పోయి, మిగతా రాష్ట్రాలు కూడా ఎదురుతిరిగే అవకాశం ఉందని గ్రహించి, ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read