వైఎస్‌కి నీడ అని ఆయనని పిలుస్తారు. వైఎస్ కోసం తన ప్రాణాలను కూడా ఫణంగా పెట్టే వ్యక్తి. మాటవరసకి వైఎస్ చెప్పాడని పోయి తన తలను గోడకి కొట్టుకున్న పిచ్చి అభిమాని. అలాంటివాడిని కూడా జగన్ తన వెంట నిలుపుకోలేకపోయాడు. అతనే రాజశేఖర్ రెడ్డి సహాయకుడు సూరీడు. ఇప్పుడు సూరీడు తెలుగుదేశం పార్టీలో చేరే అవకా శాలున్నాయి. ఈ మేరకు గురువారం ఆయన కడప జిల్లాళ్లు చెందిన మంత్రి ఆదినారాయణరెడిని వెలగపూడి సచివాలయంలో కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వైఎస్ కుటుంబంతో దశాబ్దాల అనుబంధం కలిగిన సూరీడు ఇటీవలి కాలంలో కాంగ్రెస్లో క్రియాశీలకంగా ఉండి, గత ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడం, రాష్ట్ర విభజన జరిగిపోవడం వంటి కారణాలతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూవస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండటంతో రాయలసీమకు చెందిన కొందరు మంత్రులతో, కొన్ని నెలలుగా సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సూరీడు తెలుగుదేశంలో చేరతారనే వార్తలకు బలం చేకూరింది. వైఎస్ మృతి అనంతరం జనగ్మోహనిరెడ్డితో కలిసి తన ప్రస్థానాన్ని సూరీడు కొనసాగిస్తారని అంతా భావించారు. అయితే వైఎస్ వద్ద లభించిన గౌరవం జగన్మోహన్ రెడ్డి వద్ద లభించదనే కారణంతో ఆయన ఆ కుటుంబానికి దూరమవుతూ వచ్చారని ప్రచారం జరుగుతోంది. మళ్ళీ సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సూరీడు గురువారం వెలగపూడి సచివాలయానికి వచ్చి మంత్రి ఆదినారాయణ రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టీడీపీలో చేరే దిశగానే ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
అయినా సూరీడు వస్తే ఏంటి ? ఏంటంటే… దాదాపు రెండు దశాబ్దాలకిపైగా వైఎస్ కుటుంబానికి సన్నిహితుడుగా ఉన్నాడు సూరీడు. కుంభకోణాల్లో చిక్కుకున్నా కోట్లకి కోట్ల ఆరోపణలు వచ్చినా జాగ్రత్తగా చేసుకోవాల, అని వైఎస్ బుజ్జిగా మందలించేవారు తప్పితే అతని మీద ఎలాంటి యాక్షనూ లేదు ఎప్పుడూ ! వైఎస్ మరణం తర్వాత ఇంట్లోనే ఉన్న సూరీడును జగన్ గట్టిగానే మెలిపెట్టాడు అంటారు. అప్పట్లో వ్యవహారాలన్నీ తవ్వితీసి, ఎంత వెనకేసేశావో కట్టమన్నాడని చెబుతారు. ఆ దెబ్బతో సూరీడు ఎటో వెళ్లిపోయాడు. మళ్లీ ఇన్నాళ్లకి, అది కూడా ఎలక్షన్ ముందు బైటకి వచ్చాడనే టాక్ నడుస్తోంది. మరి ఏం చెప్తాడు ? టీడీపీలోని ఓ మంత్రి, ఎమ్మెల్సీలతో టచ్ లో ఉన్నాడని అంటున్నారు. అసలకే సెల్ఫ్ గోల్స్ తో ఎటు పోతున్నాడో తెలియని జగన్ కి, ఇలాంటి సమయంలో సూరీడు లాంటి వాళ్లు ఇంటిగుట్టు బైటపడితే రాజకీయంగానే కాదు… జిల్లాలోనూ జగన్ దారుణంగా బోల్తా కొట్టే అవకాశాలుంటాయ్.