అనంతపురం ఎస్పీ, సీఐని ఫోన్లో బెదిరించిన కేసులో టీటీడీ మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులకు సన్నిహితుడైన బోరుగడ్డ అనిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకెళితే.. గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్‌ ఓ చర్చి విషయంలో తాను చెప్పిన వారికి అనుకూలంగా చేయాలంటూ అనంతపురం ఎస్పీ, సీఐని ఫోన్‌లో బెదిరించాడు. 4 రోజుల క్రితం కేంద్రమంత్రి ఓఎస్డీని అంటూ పోలీసులపై ఆయన బెదిరింపులకు దిగాడు. అసలు ఇతనెవరు..? బ్రాక్‌గ్రౌండ్ ఏంటి అని ఆరాతీసిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ నంబర్‌ ఆధారంగా వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకున్నారు. ప్రత్యేక బృందం ఆయనకోసం గాలించి గుంటూరులో అదుపులోకి తీసుకుని అనంతపురం తరలించింది.

borugadda 03082018

అనిల్ అనే వ్యక్తి టీటీడీ మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులకు సన్నిహితుడని తెలిసింది. రమణదీక్షితుల ఆరోపణలకు మద్దతుగా కోర్టులో పిల్‌ వేస్తానని చెప్పాడని సమాచారం. కాగా ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు.. అనిల్‌ను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశముంది. అనిల్‌పై ఐపీసీ 120(బి), 506,185, 419 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గుంటూరుకు చెందిన అనిల్‌.. సైమన్స్‌ అమృత్‌ ఫౌండేషన్‌ అనే క్రైస్తవ చారిటీ సంస్థను నిర్వహిస్తున్నారు. ఆయన... రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్పీఐ) రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అని చెప్పుకుని తిరుగుతూ ఉంటారు. గత ఏడాది రాజధాని పరిధిలోని తాడికొండ స్టేషన్‌లో ఆయనపై మారణాయుధాలు కలిగి ఉండటంతోపాటు చీటింగ్‌ కేసు నమోదైంది. ఓ స్థలం విషయంలో 2016 ఏప్రిల్‌లో ప్రకాశం జిల్లాకు చెందిన ఇంటూరి సురేశ్‌ బాబును బెదిరించి డబ్బు డిమాండ్‌ చేశారని, తప్పుడు డాక్యుమెంట్లతో ఆస్తిని కాజేసేందుకు ప్రయత్నించారని కేసు నమోదైంది.

borugadda 03082018

అనిల్‌ను అరెస్టు చేశారు. ఈ సమయంలో ఆయన కారులో మారణాయుధాలు లభించాయి. దీంతో రెండు కార్లను కూడా తాడికొండ పోలీసులు సీజ్‌ చేశారు. అనిల్‌ గుంటూరులో తనకు తాను ప్రముఖుడిగా చెప్పుకుంటూ కేంద్ర మంత్రుల పేర్లు చెప్పుకొని పంచాయితీలు చేస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి. తన కారుపై ఎంపీల స్టిక్కర్‌ వేసుకొని తిరుగుతూ.. కేంద్ర మంత్రులు, ప్రముఖులు తనకు బంధువులని చెప్పుకుంటారని తెలుస్తోంది. ‘మా పిన్నమ్మ జగన్‌కు బంధువు’ అని అనిల్‌ పేర్కొంటారని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఓ క్రైస్తవ సంస్థ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పత్రికలకు ఫొటోలు పంపుతుంటారు. జగన్ బావమరిదిని అని చెప్పుకుంటూ, వైఎస్ వై. యెస్. వివేకానంద రెడ్డికి మేనల్లుడు వరుస అని కూడా చెప్పుకుంటూ తిరుగుతాడని, ఇప్పటి వరకు వైఎస్ ఫ్యామిలీ ఈ ప్రచారాన్ని ఖండించలేదని, వైఎస్ ఫ్యామిలీకి ఈయన బంధువు అని చెప్పటానికి ఇదే నిదర్శనం అని అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read