నటసింహ నందమూరి బాలకృష్ణ తన 100 వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణిగా బాలయ్య నటిస్తున్న సంగతి తెలిసిందే. గౌతమిపుత్ర శాతకర్ణి అమరావతిని రాజధానిగా చేసుకుని సువిశాల సామ్రాజ్యాన్ని ఏలిన చక్రవర్తి. పూర్వం వ్యక్తుల పేర్లకు ముందు తండ్రుల పేర్లే ఉండేవి. అది చాలా హీనం అని భావించాడు శాతకర్ణి. అలాంటి కరుడుగట్టిన పితృస్వామ్య రోజుల్లో కూడా తన తల్లి పేరైన గౌతమిని తన పేరుకు ముందు పెట్టుకుని ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ అని పిలిపించుకున్నాడు. అందుకే తన పేరు గౌతమిపుత్ర శాతకర్ణిగా మారింది.
ఇప్పుడు ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్-డే క్రికెట్ మ్యాచ్ లో ధోని, కోహ్లి, రహనే, వాళ్ళ తల్లి పేరుతో ఉన్న జెర్సీలు వేసుకుని కనిపించారు.. దీనికి ఈ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకి సంబంధం లేదు కాని, అసల విషయం ఏమిట్ అంటే, స్టార్ నెట్వర్క్ మరియు BCCI సహకారంతో “Maa Ka Naam” అనే campaginలో భాగంగా, ఇలా తల్లి పేరుతో ఉన్న జెర్సీలు వేసుకుని కనిపించారు.
ధోని, తన తల్లి పేరు దేవకీ, కోహ్లి తన తల్లి పేరు సరోజ్, రహనే తన తల్లి పేరు సుజాతా పేరుతో ఉన్న జెర్సీలు వేసుకుని ఈ campagin కు తమ వంతు సహకారం అందించారు.. ఈ campagin ఇప్పుడు బాగా పాపులర్ అయింది.
అయితే, ఆంధ్ర రాష్ట్రంలో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ప్రకటించిన దెగ్గర నుంచి, ఈ తల్లి సెంటిమెంట్ ఆల్రెడీ బాగా పాపులర్ అయింది. ఏది ఏమైనా, ఇలా తల్లికి గౌరవం ఇవ్వటం, యువత అంతా దీనికి ఆకర్షితులు అవ్వటం సుభ పరిణామం.