దశాబ్దాలుగా కలియుగ దైవం వెంకన్నకు సేవ చేసి, రాజకీయంగా పావుగా మారి, చివరకు ఆ వెంకన్ననే రోడ్డుకు లాగిన, శ్రీవారి ఆలయం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, సడన్ గా ప్లేట్ మార్చారు. మొన్నటి దాక చంద్రబాబుని అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టాలని, విఫలయత్నం చేసి, చివరకు కేంద్ర న్యాయ శాఖ నుంచి కూడా మొట్టికాయలు తిని, ఇప్పుడు ఈయన ఎందుకు ఇలా మాట్లడతున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. మనిషిలో మార్పు ఎమన్నా వచ్చిందా, లేక ఇంకా ఏమైనా కుట్రా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. మంగళవారం ఆయన చెన్నైలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు పై రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు మనసులో ఏమీ లేదని, కొందరి ప్రోద్బలంతోనే తనపట్ల ఆయనకు వ్యతిరేకత ఏర్పడిందని టీటీడీ మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు తెలిపారు. తాను గతంలో చేసిన ఆరోపణల పై భక్తుల నుంచి స్పందన కరువైందని, కొండమీదున్న సాటి అర్చకుల మద్దతుకూడా లభించలేదని, ఎందుకు ఇలా జరిగిందో అని ఆవేదన వ్యక్తం చేసారు. సీఎం చంద్రబాబు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఎస్వీ యూనివర్సిటీలో నాకు జూనియర్. నాకు బాగా పరిచయమైన వ్యక్తి. కొంతమంది ప్రోద్బలంతో ఆయన నాకు వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన మనసులో మాత్రం ఏమీ లేదు. మేమంతా స్వామివారి భక్తులమే. నేను అర్చకుణ్ని కాబట్టి కొండపై అంతా బాగుండాలని కోరుకుంటా. ఆయన రాష్ట్రమంతా బాగుండాలని కోరుకోవాలి అని రమణ దీక్షితులు అన్నారు.
మరో పక్క మహాసంప్రోక్షణ సమయంలో దర్శనాలు రద్దు చెయ్యకూడదు అని అన్నారు. అయితే, వీలైనంత వరకు, పరిమిత సంఖ్యలోనైనా దర్శనాలకు అనుమతించాలని సీఎం అప్పటికే ఆదేశించారని విలేకరులు రమణ దీక్షితులు దృష్టికి తీసుకొచ్చారు. ఇది విని, చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకున్నారు, టిటిడి ఇప్పటికైనా ఆ నిర్ణయం సమీక్షించాలి అని అన్నారు. అయితే, ఇప్పుడు రమణ దీక్షితులు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనే సందేహాలు కలుగుతున్నాయి. ఒక పక్క బీజేపీ అగ్ర నేతలను కలవటం, మరో పక్క జగన్ ను కలవటం, క్రీస్టియన్ మత ప్రచారాకులతో ప్రెస్ మీట్లు పెట్టి, రాష్ట్ర పరువుని తీస్తూ, తిరుమల పవిత్రతను దెబ్బ తీసిన దీక్షితులు, ఇప్పుడు ఎందుకు ఇలా చంద్రబాబుని పోగుడుతున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి.