రేయింబవళ్లు అన్నది చూడక పోలవరం పనులు సాగుతున్నాయి. వర్షం తెరిపి ఇవ్వడంతో తిరిగి సోమవారమే ప్రాజెక్టు పనుల్నిఆరంభించారు. ప్రతికూల పరిస్థితుల్నీ ఎంత మాత్రం లక్ష్య పెట్టడం లేదు. కేవలం కుంభ వర్షం కారణం గానే ఆదివారం తప్పని సరి పరిస్థితుల్లో పనులకు విరామం ఇచ్చారు. ఊహించని విధంగా కొంత మేర వాతావరణం సహకరించడంతో స్పిల్‌ వే పనుల్నీ మొదలెట్టారు. ఒక రోజు పని పోవడాన్ని కంపెనీ, అధికా రులు జీర్ణించుకున్నట్లు లేరు. బహుశా వీరు ఆదివారం రాత్రి నిద్రపోయినట్లు లేరేమో! అన్పిస్తోంది. నిర్దేశించిన సమయానికే ఎలాగైనా సరే పనుల్ని పూర్తి చేసేందుకు నవయుగ కాంట్రాక్ట్‌ ఏజెన్సీ ఉందన్నది విస్పష్టం. పగేలే కాదు, రాత్రి వేళా పనుల్ని లైటింగ్‌లో చేసేందుకు మోపును పెట్టారు.

poalvaram 17072018 2

అసలే పైన కారు మబ్బులుతో ఆకాశం గర్జిస్తోంది. ఏ మాత్రం జంకు లేకుండా ఇంజనీరింగ్‌ అధికారులు కమిట్‌ మెంట్‌తో ఉన్నారు. సాయంత్రం సమయమే చిమ్మ చీకట్లను ఆ ప్రాంతం అల ముకుంది. చక్కటి లైటింగ్‌ను ఏర్పాటు చేయడంతో చూసేందుకు అదో అనుభూతన్నట్లు పనులు సాగుతు న్నాయి. బహుశా ఇందు కోసమే సిఎం చంద్రబాబు కంపెనీ హెడ్‌ శ్రీధర్‌ పై అపార నమ్మకాన్ని ఉంచారన్పి స్తోంది. రాష్ట్ర సర్కార్‌ నమ్మకాన్ని కాంట్రాక్ట్‌ ఏజెన్సీ, ఇంజనీరింగ్‌ ఉన్నాతాధికారులు వమ్ము చేయకుంది. తమ లక్ష్యంలో ఓ రోజు అనుకోకుండా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. వెనక బడ్డ ఒక రోజు పనిని రికవరీ చేసేందుకు వీరంతా ఎంతో హైరానా పడుతున్నారు. నిజంగా ఇది అభినందనీయమే. మరో మారు శభాష్‌ అన్పించుకునేందుకు వీరంతా తాపత్రయ పడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంటోంది.

poalvaram 17072018 3

ఏ కొద్ది పాటి వర్షాన్నీ లెక్క చేయడం లేదు. నిజంగా పని రాక్షసులు అనే పదం వీరికి అచ్చుగుద్దినట్లు సరిపోతుందన్పి స్తోంది. ఒక రోజు విరామాన్ని తామెంత మాత్రం ఊహించలేదని ఈఎన్‌సి ఎం వెంకటేశ్వరావు ఆంధ్రప్రభ బ్యూరోతో అన్నారు. ఏదేమైనప్పటికీ సీఎం చంద్రబాబు నిర్దేశించినట్లుగా పోలవరాన్ని పూర్తి చేసేందుకు కాంట్రాక్ట్‌ ఏజెన్సీ నవయుగ , ఇంజనీరింగ్‌ అధికార యంత్రాంగం చిత్త శుద్దితో కన్పిస్తోంది. చుట్టూ ఆందోళన కరమైన గోదావరి పరవళ్లనూ ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. విరామం లేకుండా సాగుతున్న పోలవరం పనులపై ప్రజానీకం హర్షామోదంతో ఉంది. రాజకీయ అవరోధాలే కాదు, ప్రకృతి ఆటంకాలనూ పోలవరం అధిగమిస్తుండటం అనిర్వచనీయమే అంటున్నారు. పోలవరం సాగుతున్న తీరును చూసి ప్రత్యర్థి వర్గాలు సైతం ఔరా ! అనక తప్పదన్నట్లుంది. ఏపీకి జీవనాడైన పోలవరాన్ని అన్ని విధాలా అంతా స్వాగతిస్తున్నారు. (ఆంధ్రప్రభ సేకరణ)

Advertisements

Advertisements

Latest Articles

Most Read