చెప్పినట్టుగానే అగ్రిగోల్డ్‌ భాదితులకి న్యాయం చేస్తున్నారు చంద్రబాబు. జనాల నెత్తిన టోపీ పెట్టి మూసేసిన చిట్ ఫండ్ కంపనీ నుంచి, ఆస్తులు రికవర్ చేసి, వేలం వేసి, డబ్బులు రికవరీ చేసి, బాధితులకి తిరిగి డబ్బులు ఇవ్వనుంది చంద్రబాబు ప్రభుత్వం. విశాఖపట్నంలో, విఆర్‌ చిట్స్‌ బాధితులను ఆదుకున్న తరువాత నుంచి, అగ్రి గోల్డ్ బాధితులు కూడా, కొండ అంత అండతో, చంద్రబాబు మమ్మల్ని ఆదుకుంటారు అనే నమ్మకంతో ఉన్నారు. అయితే అనేక కారణాలతో, విషయం కోర్ట్ లో ఉండటంతో, లేట్ అవుతూ వస్తుంది. అయితే, ఇప్పుడు వీరి బాధలు తీరనున్నాయి. తొలి విడతగా కృష్ణా జిల్లా పరిధిలోని అగ్రిగోల్డ్‌ సంస్థ ఆస్తుల విక్రయ ప్రక్రియ ప్రారంభమైంది.

agrigold 17072018 3


కృష్ణా జిల్లాలోని అగ్రిగోల్డ్‌ ఆస్తులకు మచిలీపట్నంలోని కలెక్టర్‌ కార్యాలయంలో వేలం నిర్వహించారు. హై కోర్ట్ ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న అగ్రిగోల్డ్‌ ఆస్తులను ఏడు లాట్లుగా విభజించి వేలం టెండర్లను ఆహ్వానించారు. ప్రతి లాట్‌కు న్యాయస్థానం రిజర్వ్‌ ధర నిర్ణయించింది. కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన వేలం ప్రక్రియలో మూడో లాట్‌ కోసం ఇరువురు వేలంలో పాల్గొన్నారు. మిగిలిన లాట్‌లకు ఎవరూ రాలేదు. మూడో లాట్‌కు సంబంధించి విజయవాడ మొగల్రాజపురంలోని 630 చదరపు గజాల స్థలంలోని ఐదు అంతస్తుల భవనానికి న్యాయస్థానం రూ.11 కోట్లు రిజర్వ్‌ ధరగా నిర్ణయించగా.. టి.చంద్రశేఖరరావు అనే వ్యక్తి రూ.11,11,11,111లకు పాడారు.

agrigold 17072018 3

ఈ ధరను న్యాయస్థానానికి నివేదించి తదుపరి ఆదేశాల మేరకు ఆస్తిని పాటదారునికి అప్పగిస్తామని కలెక్టర్‌ లక్ష్మీకాంతం తెలిపారు. వేలం సాగని మిగిలిన లాట్లకు సంబంధించి న్యాయస్థానం నియమించిన త్రిసభ్య కమిటీ తిరిగి సమావేశమై తదుపరి వేలం తేదీలను నిర్ణయిస్తుందని కలెక్టర్‌ చెప్పారు. వేలం ప్రక్రియలో త్రిసభ్య కమిటీ సభ్యులైన కలెక్టర్‌ లక్ష్మీకాంతం, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పీఆర్‌ రాజీవ్‌, జిల్లా రిజిస్ట్రార్‌ బి.శివరాంతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి బీఆర్‌ అంబేడ్కర్‌, సీబీసీఐడీ ఎస్పీ ఎస్‌.త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. కొన్నిరోజుల క్రితం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అగ్రిగోల్‌ ఆస్తుల విక్రయంపై ముఖ్యమంత్రి నిర్దిష్టమైన ఆదేశాలు జారీచేశారు. రెండు వారాల్లోగా స్పష్టమైన పురోగతి, ఫలితం ఉండాల్సిందేనని అధికారులకు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థ ఆస్తుల విక్రయ ప్రక్రియకు కృష్ణాజిల్లా నుంచి శ్రీకారం చుట్టాలని అధికారులు నిర్ణయించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read