వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి పార్టీ మారిన ఎంపీ బుట్టా రేణుకను వైఎస్సార్ కాంగ్రెస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా పరిగణిస్తూ కేంద్రం ఆహ్వానించింది. పార్టీ మారిన ముగ్గురు ఎంపీలను కూడా వైకాపా ఎంపీలుగా లోకసభ గుర్తించింది. వైసీపీ తరఫున ఎంపీగా గెలుపొందిన బుట్టా రేణుక ఆ తర్వాత జగన్ టార్చర్ భరించలేక టీడీపీలో చేరారు. కానీ పార్లమెంట్‌ అధికారిక జాబితా ప్రకారం ఇప్పటికీ ఆమె వైసీపీ సభ్యురాలే. ఇదే విషయం మరోసారి రుజువైంది. రేపటి నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఇవాళ అన్ని పార్టీల ఫ్లోర్‌ లీడర్లతో లోక్‌సభ స్పీకర్‌ సమావేశం ఏర్పాటు చేశారు.

parliament 17072018 2

ఈ సమావేశాలకు రావాల్సిందిగా వైసీపీ ఫ్లోర్‌ లీడర్‌ హోదాలో రేణుకకు ఆహ్వానం అందింది. కేంద్ర మంత్రి అనంత కుమార్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ సమాచారం అందడంతో వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ ఫిరాయించిన ఆమెను అనర్హురాలిగా ప్రకటించాలని రెండేళ్లుగా కోరుతున్నా స్పీకర్‌ స్పందించకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొందని పేర్కొంది. తాజా పరిస్థితిని మాజీ ఎంపీలు జగన్ కి వివరించారు. ఈ విషయాన్ని మరోసారి స్పీకర్ ని కలిసి ఫిర్యాదు చెయ్యాలని జగన్ సూచించారు. సాయంత్రం లోపు పార్లమెంట్ సెక్రటరీని కలిసి, ఈ విషయం పై చర్చించనున్నారు వైసిపీ ఎంపీలు.

parliament 17072018 3

ఇటీవల వైకాపా ఎంపీలు. వైఎస్ అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వరప్రసాద్, మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజీనామా చేసారు. వారు రాజీనామా చెయ్యటంతో, పార్లమెంట్ వర్గాలు ఇలా చేసారు. ఇప్పుడు బుట్టా రేణుకను వైసీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా గుర్తింస్తూ ఆహ్వానించడంపై వైపీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే బుట్టా రేణుక మాత్రం, నేను జగన్ విధానాలు నచ్చక, ఎప్పుడో అతనకి దూరం జరిగాను అని, పార్లమెంట్ వర్గాలు ఇలా ఎందుకు చేసారో తెలియదు అని, నేను ఈ సమావేశానికి వెళ్ళను అని చెప్పినట్టు సమాచారం. బీజేపీ - వైసిపీ కుమ్మక్కు అయ్యాయి అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న నేపధ్యంలో, ఇరు వర్గాలు ఈ మచ్చ తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భగంగా, ఇలా చేసి ఉంటారని, తెలుగుదేశం నేతలు అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read