చంద్రబాబు అంటే, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ కు ఎంత వ్యతిరేకతో అందరికీ తెలిసిందే. చంద్రబాబు ఏ పని చేసిన ఒంటి కాలు మీద వెళ్లి, చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వారి లిస్టు తీస్తే, ఉండవల్లి టాప్ 5 లో ఉంటారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి, చంద్రబాబు పై విరుచుకు పడే ఉండవల్లి, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినా, ఏ రాజకీయ పార్టీలో లేకపోయినా, వారానికి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి, చంద్రనాబుని నాలుగు తిట్లు తిట్టి, జగన్ ని ఆకాశానికి ఎత్తి, ప్రెస్ మీట్ ముగిస్తారు. జగన్ కు అనుకూలంగా రాజకీయ ప్రసంగాలు చేస్తారు అనేది బహిరంగ రహస్యం. అయితే, తాను జగన్ కు అనుకూలం కాదు అంటూనే, చంద్రబాబు ఓడిపోవాలని, జగన్ గెలుస్తాడని ప్రచారం చేస్తూ ఉంటారు. చంద్రబాబు వ్యతిరేకులతో కలిసి, ఎప్పుడూ చంద్రబాబుని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు..
ఈ నేపధ్యంలో, కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సీఎంవో ఆహ్వానం మేరకు ఏపీ సచివాలయానికి వెళ్లారు. మరికాసేపట్లో సీఎం చంద్రబాబుతో భేటీకానున్నారు. నిత్యం చంద్రబాబుని, విభేదించే ఉండవల్లిని, సియం కార్యాలయం ఆహ్వానించటం, ఉండవల్లి సచివాలయానికి వెళ్ళటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే, ఉండవల్లిని కలవటం వెనుక కూడా రాష్ట్ర ప్రయోజనాలే ఉన్నాయాని, ఒక పక్క ప్రతిపక్షం కేంద్రంతో పోరాటానికి కలిసిరాకపోవటం, బీజేపీతో లాలూచి పడటం చూస్తున్నాం. అయితే ఉండవల్లి మాత్రం, మొదటి నుంచి బీజేపీ విభేదిస్తూ వస్తున్నారు. విభజన హామీలు, పార్లమెంట్‌లో పోరాటంపై గతంలో సీఎంకు ఉండవల్లి లేఖ రాశారు. మరో రెండు రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానుండటంతో సీఎంవో కార్యాలయం నుంచి ఉండవల్లికి పిలుపురావడం ఆసక్తిని రేపుతోంది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన ముగిసిన వెంటనే చంద్రబాబు సచివాలయానికి వెళ్తారని, ఆ తర్వాత ఉండవల్లి భేటీ అవుతారని తెలుస్తోంది.
అయితే పూర్తి వివరాలు, భేటీ అయిన తరువాత కాని తెలియదు. జులై 6వ తారీఖు ఉండవల్లి చంద్రబాబుకి లేఖ రాసారు. ‘రాష్ట్ర విభజన బిల్లు సక్రమంగా ఆమోదం పొందలేదన్న విషయమై ఈ వర్షాకాల సమావేశాల్లోనైనా చర్చించాలంటూ నోటీసు ఇస్తే బాగుంటుంది.. ఈ విషయాన్ని గతంలో వైసీపీ, టీడీపీలకు కూడా సూచించాను.. కానీ వైసీపీ ఎంపీలు పార్లమెంటు సమావేశాలను సద్వినియోగం చేసుకోకుండా రాజీనామా చేశారు... ఇక ఉన్నది టీడీపీ ఎంపీలు మాత్రమే. వారైనా లోక్‌సభలో చర్చకు నోటీసు ఇవ్వాలి. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్, బీజేపీ రెంటికీ బాధ్యత ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 7న లోక్‌సభలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగంలో కూడా విభజన అంశం ఇంకా రగులుతున్నట్లు పేర్కొన్నారు. ప్రధానే సభలో ఈ విషయం మాట్లాడాక.. అన్యాయానికి గురయ్యామని ఆరోపిస్తున్న మన ఎంపీలు అదే విషయాన్ని పార్లమెంటులో చర్చించడానికి ఎందుకు వెనుకాడాలి’ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆ లేఖలో రసారు.