పోతుల సురేష్.. పరిటాల రవికి అత్యంత సన్నిహితుడు. దివంగత చమన్, పోతుల సురేష్, వీరిద్దరూ రవికి అత్యంత సన్నిహితులు. 2004లో ఉమ్మడి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మారణహోమం నుంచి, వీరిని కాపడటానికి, పరిటాల రవి వీరిద్దరినీ అండర్ గ్రౌండ్ కు పంపించారు. కొన్ని రోజులకే రవిని చంపేశారు. చమన్, పోతుల సురేష్ చాలా రోజులు అండర్ గ్రౌండ్ లోనే ఉన్నారు. ఆ చెడు జ్ఞాపకాలను, పోతుల సురేష్, ఓ తెలుగు న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పరిటాల రవితో ఉన్న సంబంధాలు, అప్పటి మారణహోమం, తన రాజకీయ భవిష్యత్ గురించి చెప్పారు. 2004లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే, మారణహోమం మొదలు పెట్టారని, అప్పటికే వందల మందిని చంపేశారని, తొందరోలోనే పరిటాల రవిని చంపేస్తారని మాకు తెలుసని చెప్పారు.
ఆనాడు నెలకొన్న పరిస్థితుల అన్నీ గమనించి, పరిటాల రవి వద్దకు తాను మూడు ప్రతిపాదనలను తీసుకెళ్లినట్టు పోతుల సురేష్ చెప్పారు. ఇప్పటివరకు తమకు అండగా ఉన్న గ్రూపును కాపాడుకొనేందుకు గాను నేతలంతా కలిసే ఉండాలనేది మొదటి ప్రతిపాదనగా రవి వద్ద ప్రస్తావించినట్టు చెప్పారు. ఇక వ్యక్తిగతంగా ఎవరికి వారు అజ్ఞాతంలోకి వెళ్లి ప్రాణాలు రక్షించుకోవడం పై కేంద్రీకరించడమనేది రెండో ప్రతిపాదనగా రవికి చెప్పానని ఆయన గుర్తు చేశారు. ఇక మూడో ప్రతిపాదనగా వైఎస్ఆర్తో రాజీ ప్రతిపాదనను చేశానని ఆయన చెప్పారు. అయితే ఈ మూడు ప్రతిపాదనలను పరిటాల రవి తీవ్రంగా వ్యతిరేకించారని ఆయన చెప్పారు.
ఆనాడు నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఎవరికి వారు అజ్ఞాతంలోకి వెళ్లి ప్రాణాలు దక్కించకోవడమే మేలని పరిటాల రవి సూచించారని పోతుల సురేష్ చెప్పారు. అయితే తాను మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లనని పరిటాల రవి చెప్పారని చెప్పారు. అప్పటికే ఎమ్మెల్యేగా ఉేన్నందున తాను మాత్రం గ్రామంలోనే ఉంటానని రవి చెప్పారని ఆయన చెప్పారు. తగరకుంట ప్రభాకర్ రెడ్డి హత్య తర్వాత తమ ప్రాణాలకు కూడ ముప్పు ఉంటుందని భావించిన నేపథ్యంలో తమ కుటుంబసభ్యులు, సన్నిహితుల సూచన మేరకు తాను కూడ అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. మేము అండర్ గ్రౌండ్ కు వెళ్ళిన కొద్ది రోజులకే, పరిటాల రవిని చంపేశారని చెప్పారు.