మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన పొలిటికల్‌గా యాక్టివ్ అయ్యే ప్రయత్నాల్లో, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో మళ్ళీ జవసత్వాలు నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కిరణ్ టార్గెట్ అంతా జగన్ పైనే ఉందని, జగన్ ని దెబ్బ కొడితేనే మనకు మళ్ళీ భవిష్యత్తు ఉంటుందని కిరణ్ భావిస్తున్నారు. జగన్, కాంగ్రెస్ కు చేసిన అన్యాయం పై, హైకమాండ్ కూడా ఆగ్రహంగా ఉండటంతో, కిరణ్, జగన్ వైపే ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇప్పటివరకు చంద్రబాబుకి ధీటైన ప్రత్యర్ధి లేక, చంద్రబాబుని వ్యతిరేకించే వారు జగన్ వైపు చూస్తున్నారు. పవన్ వచ్చినా, అతని సామర్ధ్యం ఏంటో రోజు రోజుకి ఎక్ష్పొజ్ అయ్యి, సీరియస్ నెస్ లేని రాజకీయ నాయకుడుకిగా మిగిలిపోయాడు. ఇప్పుడు, జగన్ మీద కోపంగా ఉన్న పాత కాంగ్రెస్ వారిని, మళ్ళీ కాంగ్రెస్ లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు కిరణ్.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ రూపంలో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది అని భయపడుతున్న జగన్, ఇప్పుడు కాంగ్రెస్ పుంజుకుని, 2-3 శాతం ఓట్లు తెచ్చుకున్నా, అది తన ఓట్లే చీలుస్తుంది అని జగన్ భావిస్తున్నారు. దీంతో వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డికి ఆత్మగా వ్యవహరించిన కెవిపి రామచంద్రరావు రంగంలోకి దిగారు. తన స్నేహితుడు కుమారుడు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డికి ఇబ్బంది లేకుండా చూడటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కెవిపి రామచంద్రరావు కొంత మంది కాంగ్రెస్ వారిని, జగన్ దగ్గరకు పంపించరనే ప్రచారం ఉంది. ఈ నేపధ్యంలో, కిరణ్ దూకుడుకు బ్రేక్ వేసే ప్రయత్నం చేస్తున్నాడు కేవీపీ...
కిరణ్, ఎక్కువగా జగన్ పై ఫోకస్ చెయ్యటం తనకు ఇష్టం లేదని, జగన్ కు ఇబ్బంది అయితే కాంగ్రెస్ పుంజుకుంటుంది అనేది తప్పని, జగన్ బలహీనపడితే చంద్రబాబు పుంజుకుంటాడని కేవీపీ వాదనగా ఉంది. అయితే కిరణ్ మాత్రం, జగన్ ను బలహీనం చేసేందుకు వచ్చే ఎటువంటి అవకాశాన్నైనా వదులు కోవద్దనే ఆలోచనలో ఉన్నారు. అలాగే కేవీపీ కావాలని కొంత మంది కాంగ్రెస్ నేతలను, జగన దగ్గరకు పంపిస్తున్నారని, ఇలా అయితే పార్టీకి చాలా ఇబ్బంది అని, కెవిపి తన వైఖరిని మార్చుకోవాలని అంటున్నారాని సమాచారం. మీకు స్నేహం ఎక్కువైతే వేరే ప్రయత్నాలు చేసుకోండి అంతే కాని, పార్టీని నాశనం చెయ్యవద్దు అని, కిరణ్ చెప్పినట్టు సమాచారం. ఇదే విషయం పై నేరుగా రాహుల్ గాంధీకే ఫిర్యాదు చెయ్యటానికి కిరణ్ కూడా రెడీ అవుతున్నారు అని తెలుస్తుంది. మొత్తానికి, కేవీపీ - కిరణ్ మధ్య జగన్ చిచ్చు రేగింది.